అక్కంపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతు దారుడు మాధవరెడ్డి నామినేషన్
అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతు దారుడు మాధవరెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కురుగుంటలోని నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారికి .. తన మద్దతు దారులు లింగమయ్య, దుర్గాప్రసాద్ తో కలిసి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం మాధవరెడ్డి మాట్లాడుతూ తనకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అక్కంపల్లి పంచాయతీ ప్రజలు.. ఆశీర్వదించి తనకు సర్పంచ్ గా.. అవకాశం కల్పించి గెలిపిస్తే... పంచాయతీ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.