ఎల్‌నినో ప్రభావం నుంచి ప్రజలను కాపాడాలని భీమలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు!
ప్రజల సంక్షేమం, రైతుల శ్రేయస్సు కోసం స్వామివారిని వేడుకున్న డా. చినుకని శివ ప్రసాద్
వలిగొండ మండలం సంగెంలో ఉన్న భీమలింగేశ్వర స్వామి ఆలయంలో సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డా. చినుకని శివ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణంలో మార్పులు సంభవించి ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా కాపాడాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భీమలింగేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.
ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు శివానందం, జంగయ్య, మహేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.