BREAKING
సీపీఐ అభ్యర్థులను గెలిపించండి రాష్ట్ర నాయకులు వై. చెంచయ్య ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి పొన్నం గ్రంథాలయాలే విజ్ఞాన దీపాలు.. ఉద్యమకారుల సేవలు చిరస్మరణీయం! తాడిమర్రి శాఖ గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కృష్ణాజివాడి ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన ఎఫ్ ఎల్ ఎన్ సభ్యులు లాల్ సింగ్ అయ్యప్ప స్వామి దేవస్థానంలో వైభవంగా మండల పూజ, పుష్పయాగం దుద్దెడ మాజీ సర్పంచ్ కొంక వెంకటేశం మృతి పట్ల సంతాపం జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి కళాశాల విద్యార్థులు అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతుదారుడు నామినేషన్ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పి (ఏఆర్) శేషాద్రి నిజవల్లి సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కరీ బసమ్మ నామినేషన్ దాఖలు తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమరావతిలో 200 ఎకరాల్లో AVGC పార్క్.. 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్  నిజవల్లి వైయస్సార్సీపి సర్పంచ్ అభ్యర్థిగా జుమాను కావ్య నామినేషన్. ఎల్‌నినో ప్రభావం నుంచి ప్రజలను కాపాడాలని భీమలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు!

తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.

Select Suryaa Now
తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.

*తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.

తుర్కయంజాల్, మేజర్ న్యూస్: ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని రాగన్నగూడ డెక్కన్ బావర్చి హోటల్ ఎదురుగా అభ్యుదయ కాలనీలోనే కాకుండా కమ్మగూడ ఏపీఏటీ కాలనీ, తుర్కయంజాల్ విలేజ్ వెళ్లేదారిలో నాగార్జున కాలనీ, మన్నెగూడ చౌరస్తాలో గల శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ పరిధిలో అనుమతులకు  విరుద్ధంగా షెడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోవడం లేదని, టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.భవన నిర్మాణాలకు ఒకరకమైన అనుమతులు తీసుకుంటూ, క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు, భారీ కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల పరిశీలన, నిర్మాణాల పర్యవేక్షణ చేయాల్సిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు అందిన తర్వాత శంషాబాద్ జోనల్ కమీషనర్ స్థానిక డిప్యూటీ కమీషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికి కూడా నిర్మాణ పనులు కొనసాగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికుల ఆవేదన: 
అక్రమ నిర్మాణాల వల్ల భవిష్యత్తులో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఇబ్బందులు, డ్రైనేజీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన కనిపించడం లేదని, నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సామాన్యులు చిన్న నిర్మాణం చేపడితే అనుమతుల పేరుతో ఇబ్బందులు పెట్టే అధికారులు, భారీ నిర్మాణాల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాగన్నగూడ సాగర్ హైవే, ఏపీఏటీ కాలనీలోని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టి, అనుమతులు, వాస్తవ నిర్మాణాలను పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంతో పాటు బాధ్యులైన అధికారుల నిర్లక్ష్యంపైనా విచారణ జరిపి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆదిభట్ల డిప్యూటీ కమీషనర్ సత్యనారాయణ రెడ్డి : 
డివిజన్ పరిధిలో అనుమతులకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలను ఉపేక్షించేది లేదు. అక్రమ నిర్మాణాలపై అందిన ఫిర్యాదులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేపడతాం. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే నోటీసులు జారీ చేసి, చట్టప్రకారం కూల్చివేతతో సహా తగిన చర్యలు తీసుకుంటాం. టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశిస్తాం.

ఎడ్ల వెంకటేష్ గౌడ్, తుర్కయంజాల్, మేజర్ న్యూస్.