BREAKING
అద్దంకిలో 'ధరణి' బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం. ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ వేడుక.. దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు! భారత్ సమ్మిట్ బ్యానర్ వివాదంపై డీజీపీకి బోయా నాగేష్ ఫిర్యాదు 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీలు – సెలక్షన్ టోర్నమెంట్‌లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ఖాళీ స్థలం ఉన్న అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాల పెంపునకు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల సందర్శన - జెండా ఊపి పర్యటనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్రీడల్లోనూ బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – జిల్లా కలెక్టర్ రాజర్షి షా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకులు కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ ఓ మమ్మూట్టి, ధనుష్ కాంబినేషన్‌లో 'ఓం' మూవీపై భారీ హైప్.. ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు! ఉప సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి - ప్రజావాణిలో ఉప సర్పంచుల ఫోరం వినతి ఆర్టీసీ నూతన వీసీ అండ్‌ ఎండీగా డాక్టర్‌ అనిల్‌కుమార్‌ కుందుర్పి మండల కేంద్ర సర్పంచ్ అభ్యర్థిగా సజ్జల మల్లికార్జున. దివ్యాంగులకు సేవ చేయడం అత్యంత గొప్ప విషయంః మంత్రి సీతక్క సీపీఐ అభ్యర్థులను గెలిపించండి రాష్ట్ర నాయకులు వై. చెంచయ్య

గ్రంథాలయాలే విజ్ఞాన దీపాలు.. ఉద్యమకారుల సేవలు చిరస్మరణీయం! తాడిమర్రి శాఖ గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

Select Suryaa Now
గ్రంథాలయాలే విజ్ఞాన దీపాలు.. ఉద్యమకారుల సేవలు చిరస్మరణీయం! తాడిమర్రి శాఖ గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

తాడిమర్రి సూర్య రిపోర్టర్ బండారు వెంకటేష్   :-  పుస్తకం మనిషికి మంచి మార్గదర్శి.. గ్రంథాలయం సమాజానికి విజ్ఞాన ప్రదాయిని.. ప్రజల్లో అక్షరాస్యతను, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో గ్రంథాలయ ఉద్యమకారుల పాత్ర మరువలేనిది. అటువంటి మహనీయుల సేవలను స్మరించుకుంటూ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం తాడిమర్రి శాఖ గ్రంథాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యమానికి విశేష సేవలందించిన అయ్యంకి వెంకటరమణయ్య, డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్, పాతూరి నాగభూషణం తదితర మహనీయుల చిత్రపటాలకు గ్రంథాలయాధికారి. శీనా నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు సమాజంలో విజ్ఞాన వెలుగులు నింపుతూ ప్రజలను చైతన్యవంతం చేసిన గొప్ప వేదికలు గ్రంథాలయాలని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ప్రజల్లో జాతీయ భావాలను, చైతన్యాన్ని పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. గ్రంథాలయ ఉద్యమకారులు చేసిన కృషి వల్లే పుస్తక పఠనం ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు.నేటి ఆధునిక సాంకేతిక యుగంలోనూ పుస్తక పఠనానికి ఉన్న ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గ్రంథాలయాల అభివృద్ధికి జీవితాలను అంకితం చేసిన మహనీయులను స్మరించుకోవడం వారి సేవలకు మనం అందించే నిజమైన గౌరవమని తెలిపారు.అక్షరాన్ని ఆయుధంగా, పుస్తకాన్ని జ్ఞాన సంపదగా భావించి గ్రంథాలయ ఉద్యమానికి బాటలు వేసిన మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించడమే జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి, విద్యార్థినీ విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.