BREAKING
అనూప్ సత్యన్, మోహన్ లాల్ 'ఎల్ 368' చిత్రం.. కర్ణాటకలో రెండో షెడ్యూల్ సెట్ పనులు! దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం గోమాత సేవతో హిందూ సంప్రదాయాలకు గౌరవం అద్దంకిలో 'ధరణి' బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం. ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ వేడుక.. దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు! భారత్ సమ్మిట్ బ్యానర్ వివాదంపై డీజీపీకి బోయా నాగేష్ ఫిర్యాదు 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీలు – సెలక్షన్ టోర్నమెంట్‌లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ఖాళీ స్థలం ఉన్న అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాల పెంపునకు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల సందర్శన - జెండా ఊపి పర్యటనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్రీడల్లోనూ బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – జిల్లా కలెక్టర్ రాజర్షి షా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకులు కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ ఓ మమ్మూట్టి, ధనుష్ కాంబినేషన్‌లో 'ఓం' మూవీపై భారీ హైప్.. ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు! ఉప సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి - ప్రజావాణిలో ఉప సర్పంచుల ఫోరం వినతి ఆర్టీసీ నూతన వీసీ అండ్‌ ఎండీగా డాక్టర్‌ అనిల్‌కుమార్‌

దివ్యాంగులకు సేవ చేయడం అత్యంత గొప్ప విషయంః మంత్రి సీతక్క

Select Suryaa Now
దివ్యాంగులకు సేవ చేయడం అత్యంత గొప్ప విషయంః మంత్రి సీతక్క

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని జవహర్‌నగర్‌లో దివ్యాంగుల కోసం సేవలందిస్తున్న స్వయంకృషి సంస్థను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క సోమవారం సందర్శించారు. స్వయంకృషి సంస్థలోని దివ్యాంగులను మంత్రి సీతక్క ఆప్యాయంగా కలిసి వారితో మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల కోసం సంస్థ అందిస్తున్న సేవలు, చేపడుతున్న కార్యక్రమాలను సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.గత 35 సంవత్సరాలుగా స్వయంకృషి సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా పూర్తిగా సేవా దృక్పథంతో దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేయడం అభినందనీయమని మంత్రి సీతక్క అన్నారు. సంస్థ నిర్వాహకులు, ప్రతినిధులను ఆమె అభినందించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణకు సమీప బంధువైన సురేష్ ఆధ్వర్యంలో స్వయంకృషి సంస్థ మూడు దశాబ్దాలకు పైగా దివ్యాంగుల సేవలో కొనసాగుతోందని తెలిపారు. దివ్యాంగులకు సేవ చేయడం అత్యంత గొప్ప విషయమని మంత్రి సీతక్క అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ గౌరవం, సమాన అవకాశాలు కల్పించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. “మానవసేవే మాధవసేవ. దివ్యాంగులకు అండగా నిలవడం, వారి జీవితాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం నిజమైన సేవ. ఎలాంటి లాభాపేక్ష లేకుండా 35 ఏళ్లుగా స్వయంకృషి సంస్థ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం” అని మంత్రి సీతక్క అన్నారు. దివ్యాంగుల సంక్షేమం, వారి సాధికారత కోసం  స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని మంత్రి పేర్కొన్నారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.