BREAKING
అనూప్ సత్యన్, మోహన్ లాల్ 'ఎల్ 368' చిత్రం.. కర్ణాటకలో రెండో షెడ్యూల్ సెట్ పనులు! దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం గోమాత సేవతో హిందూ సంప్రదాయాలకు గౌరవం అద్దంకిలో 'ధరణి' బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం. ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ వేడుక.. దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు! భారత్ సమ్మిట్ బ్యానర్ వివాదంపై డీజీపీకి బోయా నాగేష్ ఫిర్యాదు 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీలు – సెలక్షన్ టోర్నమెంట్‌లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ఖాళీ స్థలం ఉన్న అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాల పెంపునకు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల సందర్శన - జెండా ఊపి పర్యటనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్రీడల్లోనూ బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – జిల్లా కలెక్టర్ రాజర్షి షా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకులు కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ ఓ మమ్మూట్టి, ధనుష్ కాంబినేషన్‌లో 'ఓం' మూవీపై భారీ హైప్.. ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు! ఉప సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి - ప్రజావాణిలో ఉప సర్పంచుల ఫోరం వినతి ఆర్టీసీ నూతన వీసీ అండ్‌ ఎండీగా డాక్టర్‌ అనిల్‌కుమార్‌

ఉప సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి - ప్రజావాణిలో ఉప సర్పంచుల ఫోరం వినతి

Select Suryaa Now
ఉప సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి - ప్రజావాణిలో ఉప సర్పంచుల ఫోరం వినతి
సూర్య జైనూర్  : సిర్పూర్ (యు) ఉప సర్పంచులకు గౌరవ వేతనం చెల్లించడంతో పాటు, గ్రామాభివృద్ధి పనుల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ సిర్పూర్ (యు) మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెందూర్ రామారావు ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి స్పెషల్ అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఉప సర్పంచులు పలు డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామసభలు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాల్లో ఉప సర్పంచుల సంతకాలు తప్పనిసరిగా తీసుకోవాలని, శిలాఫలకాలపై ఉప సర్పంచుల పేర్లు కూడా పొందుపరచాలని కోరారు. మండల స్థాయి సర్వసభ్య సమావేశాలకు ఉప సర్పంచులను ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సర్పంచులకు చైర్మన్ బాధ్యతలు అప్పగించిన విధంగానే ఉప సర్పంచులకు వైస్ చైర్మన్ బాధ్యతలు కల్పించాలని, అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ కమిటీల్లోనూ ఉప సర్పంచులకు వైస్ చైర్మన్ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు, డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెందూర్ రామారావు,ఉప సర్పంచులు ముక్తురశావ్ గణపత్, సోయం రాజు,భీమ్ రావు,పార్వతి 
పాల్గొన్నారు.