BREAKING
సీపీఐ అభ్యర్థులను గెలిపించండి రాష్ట్ర నాయకులు వై. చెంచయ్య ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి పొన్నం గ్రంథాలయాలే విజ్ఞాన దీపాలు.. ఉద్యమకారుల సేవలు చిరస్మరణీయం! తాడిమర్రి శాఖ గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కృష్ణాజివాడి ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన ఎఫ్ ఎల్ ఎన్ సభ్యులు లాల్ సింగ్ అయ్యప్ప స్వామి దేవస్థానంలో వైభవంగా మండల పూజ, పుష్పయాగం దుద్దెడ మాజీ సర్పంచ్ కొంక వెంకటేశం మృతి పట్ల సంతాపం జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి కళాశాల విద్యార్థులు అక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా టిడిపి మద్దతుదారుడు నామినేషన్ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పి (ఏఆర్) శేషాద్రి నిజవల్లి సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కరీ బసమ్మ నామినేషన్ దాఖలు తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమరావతిలో 200 ఎకరాల్లో AVGC పార్క్.. 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్  నిజవల్లి వైయస్సార్సీపి సర్పంచ్ అభ్యర్థిగా జుమాను కావ్య నామినేషన్. ఎల్‌నినో ప్రభావం నుంచి ప్రజలను కాపాడాలని భీమలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు!

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పి (ఏఆర్) శేషాద్రి

Select Suryaa Now
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పి (ఏఆర్) శేషాద్రి

వినుకొండ : జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి  ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (ఏఆర్) ఎల్. శేషాద్రి శావల్యాపురం మండలం వేల్పూరులోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, బాడీ వార్న్ కెమెరాలు తప్పనిసరిగా వినియోగించాలని, 100 మీటర్ల పరిధిలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ రూరల్ సీఐ బ్రహ్మయ్య, శావల్యాపురం ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

మల్లికార్జున్ రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..