BREAKING
అద్దంకిలో 'ధరణి' బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం. ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ వేడుక.. దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు! భారత్ సమ్మిట్ బ్యానర్ వివాదంపై డీజీపీకి బోయా నాగేష్ ఫిర్యాదు 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీలు – సెలక్షన్ టోర్నమెంట్‌లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ఖాళీ స్థలం ఉన్న అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాల పెంపునకు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల సందర్శన - జెండా ఊపి పర్యటనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్రీడల్లోనూ బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – జిల్లా కలెక్టర్ రాజర్షి షా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకులు కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ ఓ మమ్మూట్టి, ధనుష్ కాంబినేషన్‌లో 'ఓం' మూవీపై భారీ హైప్.. ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు! ఉప సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి - ప్రజావాణిలో ఉప సర్పంచుల ఫోరం వినతి ఆర్టీసీ నూతన వీసీ అండ్‌ ఎండీగా డాక్టర్‌ అనిల్‌కుమార్‌ కుందుర్పి మండల కేంద్ర సర్పంచ్ అభ్యర్థిగా సజ్జల మల్లికార్జున. దివ్యాంగులకు సేవ చేయడం అత్యంత గొప్ప విషయంః మంత్రి సీతక్క సీపీఐ అభ్యర్థులను గెలిపించండి రాష్ట్ర నాయకులు వై. చెంచయ్య

అయ్యప్ప స్వామి దేవస్థానంలో వైభవంగా మండల పూజ, పుష్పయాగం

Select Suryaa Now
అయ్యప్ప స్వామి దేవస్థానంలో వైభవంగా మండల పూజ, పుష్పయాగం

నరసరావుపేట: పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో సోమవారం మండల పూజ, పుష్పయాగం, రాత్రి పడిపూజ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి నిత్య పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 27 నక్షత్రాలకు ప్రతీకగా 27 రకాల పుష్పాలతో విశేష హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష అలంకరణ, మహా మంగళహారతి, తీర్థప్రసాదాల పంపిణీ చేపట్టారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రి పడిపూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకు న్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు ప్రవళిక సత్యం దంపతులు, కార్యదర్శి గంధం వెంకట సూర్యనారాయణ దంపతులు, మైలవరపు ధనుంజయ దంపతులు, కపిలవాయి రమేష్ చంద్రదత్, నెల్లూరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు, చేగు వెంకటేశ్వరరావు, దేవాలయ కమిటీ సభ్యులు, కొత్తూరి ప్రసాదరావు, ఏవీఆర్‌కే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉభయదాతలు కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములయ్యారు.