BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

సత్యసాయి విద్యావిహార్ లో భక్తి పారవశ్యంతో నాగులచవితి.

Select Suryaa Now
సత్యసాయి విద్యావిహార్ లో భక్తి పారవశ్యంతో నాగులచవితి.

 

పుట్టకు పాలు పోసిన చిన్నారులు - సంప్రదాయం,సంస్కృతికి పెద్దపీట.

పలాస, నవంబర్ 13,మేజర్ న్యూస్.

పలాస మండలం,రామకృష్ణాపురంలోని శ్రీ సత్యసాయి విద్యావిహార్ లో నాగులచవితి వేడుకలు శుక్రవారం భక్తి పారవశ్యంతో, అత్యంత వైభవంగా జరిగాయి. పండుగ వాతావరణం నెలకొనగా, చిన్నారుల పూజలతో పాఠశాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.నాగులచవితి పర్వదినం సందర్భంగా విద్యార్థిని-విద్యార్థులు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి, తలంటు స్నానాలు ఆచరించి సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబయ్యారు. నిత్య ఓంకార సుప్రభాత కార్యక్రమంలో పాల్గొని, భక్తి గీతాలు ఆలపించారు.అనంతరం ఉపాధ్యాయులు, వార్డెన్ల ఆధ్వర్యంలో విద్యార్థులందరూ సామూహికంగా పుట్ట వద్దకు బయలుదేరారు.పుట్ట వద్ద నాగేంద్రునికి చిమ్మిలి, చలివిడి, ఆవుపాలు, పూలు, పసుపు-కుంకుమ తదితర పూజా సామాగ్రితో విద్యార్థులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పుట్టకు పాలు పోసి, ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు.పండుగ విశిష్టత, నాగదేవత ఆరాధన వెనుక ఉన్న ఆధ్యాత్మిక పరమార్థాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.

విలువల విద్యే మా లక్ష్యం - చైర్మన్ రామేశ్వరరావు.

ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మల్లా రామేశ్వరరావు మాట్లాడుతూ... "కేవలం పుస్తకాల విద్య మాత్రమే కాదు, విలువలతో కూడిన విద్యతో పాటు సనాతన ధర్మాన్ని సంరక్షించడమే మా ప్రధాన ధ్యేయం. ఇటువంటి పండుగల ద్వారా పిల్లల్లో సంస్కారం, భక్తి భావం పెంపొందుతుంది" అని అన్నారు.ప్రిన్సిపాల్ ప్రీతి చౌదరి మాట్లాడుతూ... "ఆధునిక విద్యతో సమానంగా ఆధ్యాత్మిక విద్యను అందించడమే మా ధ్యేయం. పిల్లలు మంచి చదువుతో పాటు మంచి సంస్కారం కలిగిన పౌరులుగా ఎదగాలి" అని తెలిపారు.ఈ వేడుకల్లో వార్డెన్లు చంద్రశేఖర్,జీవన్,బలరాం, అనిత,మౌనిక,మమత, ఉపాధ్యాయులు లావణ్యకృష్ణా, ప్రవీణ,దాలేటి,విద్యార్థిని-విద్యార్థులు పాల్గొన్నారు.