BREAKING
కౌకూర్ గ్రామం కింది బస్తీలోవర్షం నిరు, వర్షపు నీటి కాలువల పనులను పరిశీలించిన బి. ఆర్. ఎస్. నాయకులు గిగ్ వర్కర్లకు 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం.. రాహుల్ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు: సీఎం రేవంత్ రెడ్డి ఇన్ముల్నర్వ ప్లాట్ల ఈ-వేలానికి భారీ స్పందన తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీలు ట్రెజరీ ఉద్యోగి. హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్ సమావేశం తేదీ మార్పు నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన....సర్పంచ్ పెద్దకొండూరులో ఉచిత వైద్య శిబిరం అప్పు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తండ్రీకొడుకులపై దాడి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల భూ పరిరక్షణకు భారీ ర్యాలీ* జెడ్ కొత్తపల్లి సమీపంలో ఆటో బోల్తా 9 మందికి గాయాలు జిల్లా ఆసుపత్రి మార్చురీ అపరిశుభ్రతపై ప్రభుత్వ విప్ బీర్ల ఆగ్రహం దూలపల్లి–జీడిమెట్ల రోడ్డు విస్తరణకు వేగం పెంచాలి రవీంద్రభారతిలో ఘనంగా న్యాయవాదుల సంగీత విభావరి

సాగర్ డిఫెన్స్ ఫౌండర్ కెప్టెన్ నికుంజ్ పరాశర్ తో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ

Select Suryaa Now
 సాగర్ డిఫెన్స్ ఫౌండర్ కెప్టెన్ నికుంజ్ పరాశర్ తో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ

విశాఖపట్నం, మేజర్‌న్యూస్‌:

 సాగర్ డిఫెన్స్ ఫౌండర్ కెప్టెన్ నికుంజ్ పరాశర్ తో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ...పూణే లిక్విడ్ రోబోటిక్స్ కో-ప్రొడక్షన్ మోడల్ ను జువ్వలదిన్నెలో ఇండో-పసిఫిక్ కోసం ఎక్స్ పోర్ట్ హబ్ గా రెప్లికేట్ చేయాలని కోరారు. IIT తిరుపతి, ఆంధ్రా యూనివర్సిటీ (మెరైన్ ఇంజనీరింగ్) తో కలిసి మారిటైమ్ అటానమీ, రోబోటిక్స్ స్కిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి. తూర్పు తీరంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్, కోస్ట్ గార్డ్ కోసం మానవరహిత నౌకల సీ ట్రయల్స్, MRO, ఫ్లీట్ సపోర్ట్ కోసం జువ్వలదిన్నెకు స్థానం కల్పించేందుకు కృషిచేస్తాం. నిర్దేశిత సీ-ట్రయల్ ఏరియాకు ఏపీ ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ఏపీ మారిటైమ్ బోర్డ్ పోర్టులలో హార్బర్ సెక్యూరిటీ, హైడ్రోగ్రాఫిక్ సర్వే కోసం USV ల పైలట్, కృష్ణా-గోదావరి బేసిన్ లో చమురు, గ్యాస్ ఆపరేటర్ల కోసం ఆఫ్ షోర్ తనిఖీ, APSDMA తో తుఫాను, వరద ప్రతిస్పందన కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. ఎండ్యూర్ ఎయిర్ / సాగర్ UAV లైన్ ను ఏపీకి ఆహ్వానిస్తున్నాం. టైర్-2 సప్లయర్లను (కాంపోజిట్స్, బ్యాటరీలు, సెన్సార్లు, ఎలక్ట్రానిక్స్) నెల్లూరుకు తీసుకురండి. జువ్వలదిన్నె చుట్టూ మత్స్యకార కమ్యూనిటీల నుంచి ప్రాధాన్యత హైరింగ్, స్మార్ట్ ఫిషింగ్ ఫ్లీట్ నెట్ వర్క్ ను త్వరగా అభివృద్ధి చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. సాగర్ డిఫెన్స్ ఫౌండర్ నికుంజ్ పరాశర్ మాట్లాడుతూ... తమ సంస్థ బోయింగ్ కంపెనీ అయిన లిక్విడ్ రోబోటిక్స్, ఏరియల్ రోబోటిక్స్ సంస్థ ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.