BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

రూ 35 లక్షలతో రుద్ర భూమి ఆధునీకరణ -- ప్రారంభించిన విప్ నాయకర్

Select Suryaa Now
రూ 35 లక్షలతో రుద్ర భూమి ఆధునీకరణ -- ప్రారంభించిన విప్ నాయకర్

నర్సాపురం రూరల్, సూర్ న్యూస్ :మండలంలోని కొప్పర్రు గ్రామంలో రుద్ర భూమిని ఆ గ్రామ నివాసి, జనసేన నియోజకవర్గ నాయకులు పోలిశెట్టి శ్రీనివాస్ రూ 35 లక్షల నిధులతో ఆధునికరించారు. సకల సౌకర్యాలు ఏర్పాటుచేసిన ఈ రుద్ర భూమిని రాష్ట్ర ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి అంతిమముగా ఈ రుద్ర భూమికి చేరుకోవాలని, ఆఖరి ఘడియలలో మరణించిన వ్యక్తిని దహన సంస్కారాలు చేసేందుకు వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటుచేసిన పోలిశెట్టి శ్రీనివాస్ ను నాయకర్ అభినందించారు. ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థకు చేరిన ఈ రుద్ర  భూమిని సొంత నిధులతో అభివృద్ధి చేయటం ఎంతో గర్వకారణం అన్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కొవ్వలి  యతి రాజా రామ్మోహన్ నాయుడు లు మాట్లాడుతూ గ్రామంలో అనేక అభివృద్ధి పనులకు నిధులు వెచ్చిస్తూ గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న శ్రీనివాసుస్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, అర్బన్ బ్యాంక్ చైర్మన్ వల వల నాని తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

 రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా