BREAKING
వట్టిపల్లి మండల ఏర్పాటు వెనుక, కాంగ్రెస్ నాయకుల పోరాటం కీలకం. జేడీ చక్రవర్తికి అంతర్జాతీయ గౌరవం.. 'దాహిణీ: ది విచ్' మూవీకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ సొంతం! వైభవంగా వేపచెట్టు కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీ గుజ్జ సత్యానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలి సత్యదేవ్, ఫరియా 'ట్రయల్ అండ్ ఎర్రర్'.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం! ఫిర్యాదు పరిష్కారమైతే సరిపోదు.. ప్రజలు సంతృప్తి చెందాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్న శ్రీకాళహస్తి డిఎస్పి వరుణ్ సందేశ్ ‘కాస్ట్’ టీజర్ విడుదల.. హింసాత్మక, తీవ్రమైన డ్రామాగా సరికొత్త చిత్రం! పోలీసుల వేధింపులు తాళలేక… ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పై నుంచి దూకిన వ్యక్తి విజయదుర్గమ్మ వారి దేవి నవరాత్రుల ఉత్సవాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలి రాయదుర్గం కాంగ్రెస్‌లో భారీ చేరికలు గౌని ప్రతాపరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన 26 కుటుంబాలు కాట్రేనికోనలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు.. టాలీవుడ్‌లోకి శ్రీకాంత్ కూతురు ఎంట్రీ.. హీరోయిన్‌గా అరంగేట్రం చేయనున్న మేధ!

రోడ్లతోనే గ్రామీణాభివృద్ధి.. గ్రామమే దేశానికి మూల నిధి.

Select Suryaa Now
రోడ్లతోనే గ్రామీణాభివృద్ధి.. గ్రామమే దేశానికి మూల నిధి.

పల్లెలకు పక్కా రోడ్లు ప్రగతికి వేగవంతమైన అడుగులు.

ఉల్లగల్లు- రమణారెడ్డి వారి పాలెం రహదారికి భూమి పూజ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.


సూర్య న్యూస్ ముండ్లమూరు. 

రోడ్ల తోనే గ్రామీణ అభివృద్ధి జరుగుతుందని తద్వారా గ్రామమే దేశానికి మూల నిధని, పల్లెలకు పక్కా రోడ్లు ఉంటే ప్రగతికి వేగవంతమైన అడుగులు పడతాయని నమ్మిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.గ్రామీణ ప్రాంత రహదారులకు నిధులు కేటాయించి అభివృద్ధి పరచడమే కూటమి ప్రభుత్వం ప్రధాన ధ్యేయం అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.   ఆదివారం  2 కోట్ల 45 లక్షల వి.బి.జి రాంజీ పల్లె పండుగ 3.0 తో మంజూరైన నిధులతో పెద ఉల్లగల్లు  వయా కమ్మవారిపాలెం రమణారెడ్డి పాలెం వరకు మంజూరైన నిధులతో అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు.  ఎంతో ప్రాముఖ్యత గల రహదారి గత వైసిపి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల గోతులు మయం అయ్యి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.   కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రహదారుల దుస్థితి స్వయంగా చూసి నిధులు మంజూరు చేయించడం జరిగింది అన్నారు. ఒక రహదారులే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లు అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేదలకు అందిస్తూ వారిని అన్ని రంగాల్లో ముందు ఉంచడం జరుగుతుంది అన్నారు.  కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు అన్నారు.  ముండ్లమూరు మండలానికి పల్లె పండుగ పేరుతో మూడు కోట్ల రూపాయలు పైగా నిధులు మంజూరు చేయడం జరిగింది అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు గంజంరాఘవేంద్ర, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, మండల టిడిపి అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, ఏఎంసి వైస్ చైర్మన్ కోడిగ మస్తాన్ రావు,
పంచాయతీ రాజ్ ఎ ఈ ఎం వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు గజ్జల సుబ్బారెడ్డి, బద్రి గోపాల్ రెడ్డి,కొండవీటి సుబ్బారావు, జిల్లెల్ల ముడి చౌదరి, కస్టర్ ఇంచార్జ్ పూర్ణచంద్రరావు, గ్రామ టిడిపి అధ్యక్షుడు మోతుకూరు శంకర్రావు, మాజీ జెడ్పిటిసి సభ్యులు వరగాని పౌల్, కొక్కెర నాగరాజు, డీసీ చైర్మన్లు కంచు మాటి శ్రీనివాసరావు, సందాడి సుబ్బారావు, సొసైటీ అధ్యక్షులు మేదరమెట్ల వీరనారాయణ, నాగినేని నాగేశ్వరరావు, దిరిశాల శ్రీనివాసరావు, మండల ఐటీడీ అధ్యక్షుడు చెక్క వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.