రెండో రోజు కొనసాగిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ
రెండవ రోజు కొనసాగిన మున్సిపల్
నామినేషన్ ప్రక్రియ
- చైర్మన్ అభ్యర్థిగా మూడు నామినేషన్లు
- కౌన్సిలర్ అభ్యర్థులుగా 75 నామినేషన్లు
ఆత్మకూర్, మేజర్ న్యూస్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రెండవ రోజు కొనసాగినట్లు మున్సిపల్ కమిషనర్ బేబీ తెలిపారు. రెండవ రోజు శనివారం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా మూడు నామినేషన్లు, కౌన్సిలర్ అభ్యర్థులుగా 75 నామినేషన్లు దాఖలైనట్లు కమిషనర్ తెలిపారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుంచి డాక్టర్ ఆవుల గోవిందరాజులు, కే శారద బాయి, గుజ్జుల రవిబాబులు, కౌన్సిలర్ అభ్యర్థులుగా బిజెపి -1, టిడిపి-16, వైయస్సార్సీపి -51, ఎస్ డి పి ఐ -1, స్వతంత్ర అభ్యర్థులు-6 మొత్తం 75 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.