రెండో దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్
అనకాపల్లి ప్రతినిధి, నవంబర్ 28, మేజర్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు – 2026 సందర్భంగా, జిల్లాలో ఆదివారం జరగబోవు రెండో దశ ఎన్నికల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ తెలిపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి జిల్లాలో రెండో దశలో జరగబోవు గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి శనివారం ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణ రావు లతో పాటు జిల్లా కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లాలో రేపు ఉదయం (ఆదివారం) 7-00 గంటల నుండి 8 మండలాలలో జరగబోవు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ మెటీరియల్ పంపిణీ, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు , పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకునే విధానం, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ పర్యవేక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణకు కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.