BREAKING
జిల్లాకేంద్రంలో నిర్మల్ జిల్లా ఆర్ఎంపీ ల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక : పదోతరగతివిద్యార్థులకు ఉచితంగా అన్ని అంశాల చదువు పుస్తకాల పంపిణీ పెండింగ్ పనుల్లో జాప్యం చేయొద్దు సోలక్ పల్లి లో ఉచిత వైద్య శిబిరం కోదాడ నియోజకవర్గంలో 219 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. తుఫాన్ బాధితులకు అండగా ప్రభుత్వం. ఎల్లంపేట మున్సిపాలిటీలో అంపశయ్యపై సమాచార హక్కు చట్టం.. మూడుసార్లు దరఖాస్తు చేసినా సమాచారం ఏదీ..? రైల్వే గేటు పడితే ట్రాఫిక్ కష్టాలే.. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు అక్బర్జపేట్‌లో హరితహారం మొక్కల విధ్వంసం.. 150కి పైగా మొక్కలు ధ్వంసమైనా పట్టించుకునేవారేరి..? ఎంపీ సురేష్ కుమార్ షట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత క్రెడిట్ సొసైటీ మేనేజర్ మృతి పై విచారణ జరపాలి కారు బైకు ఢీ తండ్రి మృతి కొడుకుకి తీవ్ర గాయాలు అఫ్గానిస్తాన్‌తో తొలి టెస్టు: భారీ స్కోరు సాధించిన జింబాబ్వే.. భారీ ఆధిక్యంలో పర్యాటక జట్టు! బ్రిటన్ చిన్నారుల కోసం 'ఫైండ్ ఫ్రెండ్స్' ఫీచర్‌ను డిసేబుల్ చేసిన స్నాప్‌చాట్

రైతుల.... ఆవేదన

Select Suryaa Now
రైతుల.... ఆవేదన
-వరుస తుఫానులతో కుదేలవుతున్న రైతాంగం.
-200 ఎకరాల్లో మెరుముకు కోలుకోని దెబ్బ.
- ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు.
 పెదకాకాని  న్యూస్. నవంబర్ నెలలో వరుస తుఫానులతో రైతాంగం కుదేలవుతుంది. చేతికొచ్చిన పంట నీటపాలవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి పంట కోసం ఎదురు చూసే సమయంలో ప్రకృతి తుఫాన్ రూపంలో విలయతాండవం చేయడంతో, రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ఈ సంవత్సరం ఖరీఫ్లో సమయానికి వర్షాలు పడక రైతులు ఖరీఫ్ సీజన్ మించిపోతున్న సమయంలో మినుము సాగు చేశారు. ముఖ్యంగా పెదకాకాని మండలంలో 200 ఎకరాలలో రైతులు సాగుచేసిన మినుము పంట సరిగ్గా ఏపుగా కళ్ళ మీద ఉన్న సమయంలో వరుస తుఫాన్లు  ముట్టడించడంతో మినుము పంట ఊరకేతింది. కళ్ళే మొత్తం రాలిపోయి  మూడుగా మారింది ఇప్పటికే రైతులు ఒక్కో ఎకరానికి 40 వేల వరకు  ఖర్చు పెట్టారు. బంగారం తాకట్టుపెట్టి, అప్పులు చేసి సాగు చేసిన పంట నీట ములగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎర్రబడిన మిరప నారు తిరిగి సాగు అవటం కోసం, కీటక నాసిని మందులతో పాటు, మందు కట్టలతో కలిపి పెట్టుబడి రెట్టింపు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. మండలం సాగైనా పత్తి పంటలో కూడా వర్షపు ధాటికి  నీరు నిల్వ ఉండటంతో పత్తి పొలాలు ఎర్రబాయి. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు స్పందించి, తక్షణం పంట పొలాల నష్టాన్ని సర్వే చేసి రైతులకు అందించాలని, రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలని పెదకాకాని మండల రైతులు కోరుతున్నారు. వరుస తుఫానుల కారణంగా కురిసిన భారీ వర్షాలతో పెదకాకానిలోని రజకచెరువు, మురుగు చెరువు కట్టలు తెగిపోయి మంచినీటి చెరువులో కలిసిపోయాయి. అధికారులు స్పందించి పెద్దకాకాని ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.