BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

రాష్ట్రాన్ని బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం – కేసలి అప్పారావు

Select Suryaa Now
రాష్ట్రాన్ని బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం – కేసలి అప్పారావు

విజయనగరం మేజర్ న్యూస్; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ పూర్వ ఛైర్మన్ కేసలి అప్పారావు పిలుపునిచ్చారు.   నవంబర్ 27 న అంతర్జాతీయ బాల్య, ముందస్తు మరియు బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవం సందర్బంగా ఒక ప్రకటన విడుదల చేసారు. బాల్య వివాహాలు బాలికల బాల్యాన్ని, విద్యను, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే వివాహ బంధంలోకి నెట్టబడటం వల్ల బాలికలు విద్యకు దూరమవడమే కాకుండా శారీరక, మానసిక సమస్యలను కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు: ప్రతి గ్రామం, పట్టణంలో బాల్య వివాహాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పాఠశాలలు, కళాశాలల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. బాల్య వివాహాల నిరోధక అధికారుల వ్యవస్థను బలోపేతం చేయాలి. బాలికలు మధ్యలో చదువు మానేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు చేపట్టాలి. బాల్య వివాహాల నుంచి రక్షించబడిన బాలికలకు కౌన్సెలింగ్, విద్య, పునరావాస సదుపాయాలు కల్పించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు బాల్య వివాహాల నిర్మూలనలో భాగస్వాములు కావాలి. భారతదేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 ప్రకారం బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండకముందు వివాహాలు చేయడం చట్టపరమైన నిబంధనలకు విరుద్ధమని ఆయన గుర్తుచేశారు. ప్రతి ఆడబిడ్డకు విద్య, ఆరోగ్యం, రక్షణ, గౌరవం కల్పించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. బాల్య వివాహాలను అరికట్టడం ఒక్క ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి బాల్య వివాహాల నిర్మూలనకు ఉద్యమం ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్‌ను బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కేసలి అప్పారావు పిలుపునిచ్చారు.