రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ టైక్వాండో పోటీల్లో టెక్కలి క్రీడాకారిణికి పతకం
టెక్కలి మేజర్ న్యూస్:13
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 10, 11 తేదీల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్ జి ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-19 బాలబాలికల రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో టెక్కలికి చెందిన క్రీడాకారిణి సింహాద్రి సముద్రి పతకం సాధించింది.
బాలికల 45 కిలోల విభాగంలో టెక్కలి ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రానికి చెందిన సింహాద్రి సముద్రి ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని సిల్వర్ మెడల్
కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని కోచ్ నర్సిపురం శేఖర్ తెలిపారు.
ఈ విద్యా సంవత్సరంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో టెక్కలి ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం క్రీడాకారులు ఇప్పటివరకు మొత్తం 3 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు సాధించడం విశేషం.
క్రీడాకారుల విజయాల పట్ల జిల్లా క్రీడా అధికారి (డి ఎస్ డి ఓ) మహేష్ బాబు అభినందనలు తెలిపారు. సముద్రి సాధించిన విజయం పట్ల కోచ్‌లు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.