BREAKING
అంసాన్ పల్లి గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ సైబర్ నేరాల నుంచి నిన్ను నీవు రక్షించుకోండి *అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రిపై అసత్య ఆరోపణలు* రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎస్వీయూలో ‘అన్వేషణ-2026’ ప్రారంభం -జ్ఞానానికి ఆవిష్కరణ జోడిస్తేనే భవిష్యత్ : రెక్టర్ ఆచార్య చెండ్రాయుడు కొల్చారంలో ఆల్ ఇండియా బంజారా మేళా ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి రేణిగుంటలో ఓటర్ స్లిప్పుల బీఎల్వోలు ఇవ్వలేదని ఓటర్ల ఆగ్రహం.. పైతర గ్రామంలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం జడ్పిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం.. 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. 10782 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు పేట స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా నరసింహ చారి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల సునామీ: సెనేట్, హౌస్ రెండూ వారివే సంక్షేమం అభివృద్ధి ఇవే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలి

రామచంద్రపురం లో భారీ వర్షం జలమయమైన రోడ్లు

Select Suryaa Now
రామచంద్రపురం లో భారీ వర్షం  జలమయమైన రోడ్లు

రామచంద్రపురం మేజర్ న్యూస్:గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రామచంద్రపురం పట్టణం వర్షపు నీటితో జలమయం అయింది పట్టణంలోని అన్ని వీధులు ప్రధాన రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం అంత భారీగానే వర్షం కురుస్తుండడంతో పట్టణంలోని కోర్టుల ప్రాంగణం తాసిల్దార్ కార్యాలయం ఇరిగేషన్ కార్యాలయం ప్రధాన రహదారిలోని ప్రభుత్వ పాఠశాల జూనియర్ కాలేజ్ ప్రాంగణం వర్షాపు నీటితో నిండిపోయింది మురుగు కాలువలు పొంగిపొర్లడంతో పట్టణంలోని అన్ని రహదారులు మోకాలు లోతు నీటితో నిలిచిపోయాయి దీంతో ప్రజలు వర్షపు నీటిలోని నడుస్తూ వెళ్లాల్సి వచ్చింది భారీ వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది ఆర్టీసీ డిపో ప్రధాన గేటు సగం వరకు నీటితో నిండిపోవడంతో డిపో లోపటికి బస్సులను నిలిపివేశారు ఆర్టీసీ డిపో నీటితో నిండిపోవడంతో చెరువును తలపించింది దీంతో కొన్ని సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు పట్టణంలోని బ్రాడీపేట రైస్ పేట యువ నగర్ ముచ్చిమిల్లి రోడ్డు చర్చి కాంపౌండ్ లలిత నగర్ రత్నంపేట హౌసింగ్ బోర్డ్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కళాశాల ప్రాంగణం నీటితో నిండిపోవడంతో మెటీరియల్ పంపిణీ తరగతి గదిలో నిర్వహించారు ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉండడంతో ఎన్నికల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు