పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో వినతుల స్వీకరణ.
సూర్య న్యూస్ సంతమాగులూరు.
సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వినతిపత్రాలు స్వీకరించారు. ప్రతి వినతిపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలకు పరిష్కారం చూపడమే ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి తెలిపారు.