పురుష యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..
అనంతపురం ప్రతినిధి, మేజర్ న్యూస్:ఆయుష్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనంతపురంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో పురుష యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టును భర్తీ చేయనున్నట్లు సీనియర్ వైద్యాధికారి డాక్టర్ జి. రత్న చిరంజీవి తెలిపారు.
ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, 2వ రోడ్డు, అనంతపురంలో ఒక పోస్టు మాత్రమే ఖాళీగా ఉందని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 2వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు తమ బయోడేటాతో నేరుగా హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సంబంధిత ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను సంప్రదించాలని తెలిపారు.
మల్లికార్జున, నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్ .