BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

ప్రత్యర్థికి ఓట్లు వేస్తే పంచాయతీ వల్ల కాడే...

Select Suryaa Now
ప్రత్యర్థికి ఓట్లు వేస్తే పంచాయతీ వల్ల కాడే...

పూసపాటిరేగ, నవంబరు 28, మేజర్ న్యూస్: పంచాయతీ ఎన్నికల్లో తప్పుచేసి ఓట్లు వేశారో పంచాయతీకి చెందిన ప్రజలంతా ప్రత్యర్ధి చేతిలో మోసపోవడమే కాకుండా పంచాయితీని వల్లకాడు చేసేస్తాడు అంటూ కందువలస పంచాయతీకి చెందిన సర్పంచ్ గా పోటీ చేస్తున్న దేశెట్టి రోహిణి భర్త గణేష్ ఘాటైన పదజాలంతో విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కందివలసలో కత్తిర గుర్తుపై పోటీ చేస్తున్న దేశెట్టి రోహిణి తరుపున ఆమె భర్త, మాజీ సర్పంచ్ డే శెట్టి గణేష్ ప్రచార కార్యక్రమాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రచార ర్యాలీ కార్యక్రమంలో పంచాయితీ కేంద్రమైన కందివలస తో పాటు నక్కన పేట గ్రామానికి చెందిన ఓటర్లు ర్యాలీ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి డే శెట్టి రోషిని తరుపున ఆమె భర్త గణేష్ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ నక్కన పేట గ్రామానికి చెందిన నక్కన మంగమ్మ సర్పంచ్ గా పోటీకి నిలబెట్టి పంచాయతీని వల్లకాడు చేసే విధంగా మంగమ్మ భర్త రమణ వ్యవహార శైలి పొందంటూ తీవ్రంగా విమర్శలను వ్యక్తం చేశారు. తాను సర్పంచ్ గా ఉన్న సమయంలో సచివాలయం తో పాటు రైతు భరోసా, వెల్నెస్ సెంటర్ వంటి ప్రభుత్వ భవంతులకు తమ కుటుంబీకుల సహకారంతో కందివలస గ్రామంలో కోటి రూపాయలు విలువైన స్థలాన్ని సమకూర్చిన విషయాన్ని గణేష్ గుర్తు చేశారు. హెచ్ పి ఎల్ పరిశ్రమను అడ్డం పెట్టుకొని నక్కాన రమణ జి ఎం తన చేతిలో ఉన్నారంటూ తన ఆధీనంలో లేకుంటే పరిశ్రమలో కాంట్రాక్టులను తొలగించడంతోపాటు ఉద్యోగాలను కూడా తొలగిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ నక్కన తీరును తీవ్ర పదజాలంతో గణేష్ ఎండగెట్టారు. తాను ఎటువంటి లాభాలను ఆశించకుండా పంచాయితీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించానని తాగునీటి కుళాయిలతో పాటు సిసి రహదారులు, దేవాలయాల నిర్మాణాలను చేపట్టిన విషయాన్ని గణేష్ గుర్తు చేశారు. అదే ప్రత్యర్థి మంగమ్మకు అవకాశం కల్పిస్తే ఆమె భర్త నక్కన రమణ మోసాలు చేసి భూములను కూడా అమ్మేస్తాడంటూ గణేష్ ఆరోపించారు. రమణ తన ఎ రచూపే మందు, డబ్బు కాశపడి ఓట్లు వేస్తే తీవ్రంగా నష్టపోతామన్న విషయాన్ని ఓటర్లు గ్రహించాలని ఈ సందర్భంగా గణేష్ ర్యాలీ కార్యక్రమంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  తాజాగా జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో విద్యావంతురాలు, న్యాయవాదిగా ఉన్న దేశెట్టి రోహిణి ని అత్యంత మెజార్టీతో గెలిపిస్తే కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు ఉచితంగా భూమిని కూడా సమకూర్చునున్నట్లు ఈ సందర్భంగా ర్యాలీ కార్యక్రమంలో గణేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు చాపల సత్తిబాబు, సురప్పుడు, మాజీ సర్పంచ్ ముత్యాల వెంకటరమణ, మాజీ ఉప సర్పంచ్ వెంకటప్పడు, భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు.