ప్రజాస్వామ్యం,రాజ్యాంగం పట్ల తెదేపాకి అపారమై గౌరవం : ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మతి భ్రమించింది : దౌర్జన్యాలు, అరాచకాలకు కేరాఫ్ పెద్దిరెడ్డి కుటుంబం : తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆర్.జె.వెంకటేష్ విమర్శలు
మదనపల్లి,మేజర్ న్యూస్ : రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మతిభ్రమించిందని,ప్రజాస్వామ్యం,రాజ్యాంగం పట్ల టిడిపికి అపారమైన గౌరవం ఉందని అందుకు అనుగుణంగానే ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎంపీపీ,జడ్పిటిసి ఎంపిక ప్రక్రియ జరిగిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్.జె వెంకటేష్ పేర్కొన్నారు.శుక్రవారం నిమ్మనపల్లి కూడలిలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిమ్మనపల్లి మండలం ఎంపీపీ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన ఎంపీ మిథున్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.దాడులు,దౌర్జన్యాలకు పెద్దిరెడ్డి కుటుంబం కేరాఫ్ లాంటిదన్నారు.గతంలో ఎంపీ చిన్నాన్న పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా పరిషత్ నందు జరిగిన టెండర్ ప్రక్రియకు సంబంధించిన బాక్స్ లు ఎత్తుకెళ్లిపోవడం,గత వైసిపి పాలనలో పుంగనూరు,తంబళ్లపల్లి నియోజకవర్గాలలో 2021 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల వారిని భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుని ఏకగ్రీవాలు చేసుకున్న చరిత్ర మీది కాదా అని సూటిగా ప్రశ్నించారు.ఎంపీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు.తెలుగుదేశం కార్యకర్తలకు ట్రీట్మెంట్ ఇస్తామని ఆయన చెబుతున్నారని వాస్తవానికి వైసిపి నాయకులకు ట్రీట్మెంట్ అవసరమని,ఇప్పటికే ఒకసారి పుంగనూరులో ఎంపీకి ఎంపీకి ట్రీట్మెంట్ రుచి చూపించారని ఎద్దేవా చేశారు.కూటమి ప్రభుత్వం తలుచుకొని ఉంటే ఎక్కడా వైసిపి అభ్యర్థులు గెలిచి ఉండేవారు కాదని,తెలుగుదేశం పార్టీ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానం అది కాదన్నారు.మీరు గతంలో మా అంజిరెడ్డిపైన చేసిన దాడులు,శ్రీకాకుళం వంటి దూర ప్రాంతాల నుండి సైకిల్ యాత్ర చేపట్టిన టీడీపీ కార్యకర్తలపై చేసిన దాడులను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరనన్నారు.మిమ్మల్ని ప్రజలు మూడుసార్లు ఎంపి చేస్తే,రాజంపేట పార్లమెంటు పరిధిలో మీరు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.మీ వైఫల్యానికి నిదర్శనం కడప-మదనపల్లె-బెంగుళూరు రైల్వే లైన్ ప్రతుక్ష్యంగా కనబడుతోందన్నారు.ఎంపీగా మీ నిధులతో గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపడతారని ప్రజలు ఎన్నో సంవత్సరాలనుండి ఎదురు చూడటం తప్ప,మీరు చేసింది శున్యం కాదా అని సూటిగా ప్రశ్నించారు.గతంలో మీ దాడులు,దౌర్జన్యాలు ఏ విధంగా వున్నాయో ప్రజలందరికి తెలుసునని,అలాగే మీ గతం ఏమీటో ఏవిధంగా ఎదిగారో అందరికి తెలిసిందేనన్నారు.దాడులుదౌర్జన్యాలు,విష సంస్కృతికి ప్రజలు ఎప్పుడో చరమగీతం పాడారని,అది ఇప్పటికీ మీకు అర్థం కాకపోవడం బాధాకరమన్నారు.మీకు ఎంపీగా ఇదే చివరి అవకాశమని,ఇకమీదట నుండి అయినా తప్పు తెలుసుకుంటే తప్ప,ఇక మళ్ళీ మీరు ఎంపీ కాలేరన్నారు.మిమ్మల్ని సాగానంపడానికి ప్రజలు ఇప్పటికే సిద్దంగా వున్నారని,ఇక మీరు ఇంటికే పరిమితం చేయడానికి సన్నద్ధంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో జి.ఆనంద్,రామచంద్ర నాయుడు,గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున,గండికోట గణేష్ బాబు,విద్యాసాగర్,రెడ్డెప్ప,వైద్యం కృష్ణయ్య,నారాయణ,నరసింహులు,ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి