BREAKING
గుర్తుతెలియని మోటార్ సైకిల్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు మహా పాదయాత్రని విజయవంతం చేయాలి ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన–ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కొడుకు పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమం.. బాల బాలికలకు సైకిళ్ల పంపిణీ నాగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం భైరవి హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య సేవలు ఇండియా కూటమి నిరసన కార్యక్రమానికి కోహిర్ కాంగ్రెస్ నేత ముజఫర్ హుస్సేన్ హాజరు అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం ఎండిఎంఏ 10.50.. రెండు ఫోన్లు స్వాధీనం ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలింపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనం సిద్దేశ్వరాలయంలో ఉజ్జయిని జగద్గురు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు బీఆర్ఎస్ సర్పంచులను అవమానిస్తే సహించేది లేదు.. ఆందోళన చేపడతాం: మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వైకాపాను ఆదరించాలి: మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ​దేవనబండ, ఎంపీటీసీ-7 స్థానాల్లో వైకాపా ప్రచారం బొల్లారం డివిజన్ లో పార్కింగ్ లేకుండా అక్రమ నిర్మాణాలు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంతపల్లి సర్పంచ్‌ అనంత్ రెడ్డి తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేత కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలి–: రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే జగన్‌కు ఎందుకింత ఆందోళన? - ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

Select Suryaa Now
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే జగన్‌కు ఎందుకింత ఆందోళన?   -	ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆడుతున్న రాజకీయ నాటకాలు నేడు బట్టబయలయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుంటే ఒక్క పులివెందులలోనే ఎందుకు వివాదాలు, ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. గత 40 ఏళ్లుగా పులివెందుల ప్రజలు భయాందోళనల మధ్య ఓటు వేసే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పులివెందులలో ఓటమి తప్పదనే భయంతోనే జగన్ ఈ డ్రామాలకు తెరతీశారు. వైసీపీ అంతర్గత సర్వేల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయనే ఆందోళనతో ప్రజలను, అధికారులను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. హెలికాప్టర్ సాధారణంగానే ల్యాండ్ అయినప్పటికీ సాక్షి మీడియా మాత్రం అత్యవసర ల్యాండింగ్ అంటూ తప్పుడు ప్రచారం చేసింది. ఎన్నికల సమయంలో ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలతో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. విజయవాడలోనే 870 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరుగుతుంటే పులివెందులలోనే వాహనాల దహనం, దాడులు, బెదిరింపులు, ఉద్రిక్తతలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల రోజున జరిగిన ఘటనలకు టీడీపీని బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికలతోనే వైసీపీ పతనం ప్రారంభమైంది. నేటి పరిణామాలు ఆ పతనానికి కొనసాగింపుగా కనిపిస్తున్నాయి. 2019–2024 మధ్య వైసీపీ పాలనలో రాష్ట్రంలో అవినీతి, హత్యలు, దౌర్జన్యాలు, రాజకీయ కక్షసాధింపు పెరిగాయి. సొంత బాబాయ్ హత్యకు గురైతే నాటి వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడుపై నిందలు మోపారు. సాక్షి పత్రికలో నారాసుర రక్తచరిత్ర అంటూ ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఈ కేసు దర్యాప్తులో సీబీఐ వ్యవహారానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి నేడు పులివెందులలో జగన్‌ను ప్రశ్నిస్తూ, ఓట్లు అడిగే నైతిక హక్కు ఆయనకు లేదని నిలదీస్తున్నారు. సొంత కుటుంబంలోనే వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ ఇతరులకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది.

2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందులలో 33 వార్డులకు 33 వార్డులూ అప్రజాస్వామికంగా ఏకగ్రీవం చేసుకున్నారు. నాడు అధికార బలం, డబ్బు ప్రభావం, బెదిరింపుల కారణంగానే ఏకగ్రీవాలు జరిగాయి. అదే పులివెందులలో నేడు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకే  జగన్‌కు ఆందోళన మొదలైంది. రౌడీ రాజకీయాలకు, బెదిరింపులకు చెక్ పడటంతో గొడ్డలి పార్టీలో ఆందోళన మొదలైంది. నామినేషన్ల సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రోజా తదితర గొడ్డలి పార్టీ నేతల అరాచకాలు ప్రజలంతా చూశారు. 2021లో మాచర్లలో తనపై జరిగిన దాడి ఒక ఉదాహరణ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిగా పేర్కొన్న తురక కిషోర్ తనపై, బుద్ధా వెంకన్నపై, తమ న్యాయవాదిపై దాడికి పాల్పడ్డారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ చేసిన దౌర్జన్యాలను ప్రజలు మరిచిపోలేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే వాటిని అడ్డుకునేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారు.  రాష్ట్రంలో ఇకపై ఫ్యాక్షన్ రాజకీయాలకు, గ్యాంగ్ రాజకీయాలకు, దౌర్జన్యాలకు తావులేదు. ప్రజల ఆస్తులను దోచుకున్న జగన్... కుటుంబ సభ్యుల ఆస్తుల విషయంలోనూ అదే దోరణితో వ్యవహరిస్తున్నారు. సొంత మేనకోడలి వివాహం విషయంలో కూడా వివాదాలు సృష్టించారు. పులివెందుల ప్రజలు ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది గొడ్డలి పార్టీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇస్తున్న తీర్పు.