BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

ప్రజా సమస్యలపై పోరాడడమే కామ్రేడ్ మల్లికార్జునరావుకు ఘన నివాళి

Select Suryaa Now
ప్రజా సమస్యలపై పోరాడడమే కామ్రేడ్ మల్లికార్జునరావుకు ఘన నివాళి

దేవరపల్లి, అక్టోబర్ 11 మేజర్ న్యూస్: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటమే కామ్రేడ్ యర్రా మల్లికార్జునరావుకు ఘన నివాళి అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం. సుందరబాబు అన్నారు. ఆదివారం విశ్రాంతి ఉద్యోగుల భవనంలో కె. రత్నాజీ అధ్యక్షతన జరిగిన మల్లికార్జునరావు 6వ వర్ధంతి సభలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సుందరబాబు, సీనియర్ నాయకులు ఉండవల్లి కృష్ణారావు మాట్లాడుతూ'అచ్ఛే దిన్', నోట్ల రద్దు పేరుతో ప్రజలను మోసం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీల సంపదను పెంచుతోందని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న కేంద్ర విధానాలపై, దానికి మద్దతు ఇస్తున్న రాష్ట్ర కూటమి ప్రభుత్వంపై నిరంతరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి ఎస్. భగత్, లక్ష్మి, చాపల నీలం, అడపా సూర్యరావు, గోవర్ధన్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు హర్ష, ఆటో యూనియన్ నాయకుడు సిర్రా రాజు తదితరులు పాల్గొన్నారు.