ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని అందిపుచ్చుకొని చెంచులు వ్యవసాయంలో రాణించాలి - ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని అందిపుచ్చుకొని చెంచులు వ్యవసాయంలో రాణించాలి - ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
- ఐ టి డి ఆధ్వర్యంలో ఉద్యానవన చెంచు రైతులకు పనిముట్లు పంపిణీ
ఆత్మకూర్, మేజర్ న్యూస్ : ఉద్యానవన పంటల సాగులో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను చెంచు రైతులు సద్వినియోగం చేసుకొని వ్యవసాయంలో రాణించాలని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉద్యానవన చెంచు రైతులకు పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బుడ్డా హాజరై పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ చెంచులు అడవులకే పరిమితం కాకుండా నాగరికత ప్రపంచంలోకి నడిపిస్తూ వారి అభివృద్ధికి నాంది పలికేందుకే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఐటీడీఏ సంస్థకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఐటీడీఏ ద్వారా చెంచులకు అనేక పథకాలను అందిస్తూ అభివృద్ధికి కృషి చేస్తూ రావడం జరిగిందని, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెంచులను వ్యవసాయం వైపు నడిపించేందుకు ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఉద్యానవన పంటల సాగుకు ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యానవన పంటల సాగులో రాణించాలని అన్నారు. తక్కువ పెట్టుబడి తక్కువ నీటి అవసరత ఉన్న ఉద్యానవన పంటల సాగులో రాణిస్తే అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. ఉద్యానవన రైతులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం సబ్సిడీ ద్వారా పరికరాలను అందించడంతోపాటు ఆర్థిక సాయం కూడా అందించడం జరుగుతుందని అన్నారు. ప్రతి గూడెంలో మౌలిక వసతులతో పాటు విద్య వైద్యం అందేలా కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడి అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.