పిడుగురాళ్లలో ఘనంగా జాబ్ మేళా - 62 మందికి ఉద్యోగ అవకాశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆదేశాల మేరకు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజీ రావు తెలిపారు.
ఇందులో భాగంగా నేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల, పిడుగురాళ్ల నందు జాబ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ డ్రైవ్ కు 10 కంపెనీలు హాజరు కాగా 188 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 62 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ఈ జాబ్ మేళాను పిడుగురాళ్లలో నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. నియామక పత్రాలు అందుకున్న యువతకు అభినందనలు తెలిపి, మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకునే విధంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉద్యోగ కల్పన అధికారి రవీంద్ర నాయక్, పిడుగురాళ్ల స్కిల్ హబ్ కోఆర్డినేటర్ శ్రీకాంత్, రమ్య, వీరాంజనేయులు మరియు కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల