BREAKING
నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మీ దంపతులు. ఉచిత కంటి శిబిరంలో 67 మందికి కంటి పరీక్షలు. -జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు గుండ్లసాగరం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి వత్సలమ్మ వరదరాజులు విజయం 25 వేల106 మందికి డిజిటల్ ఎక్స్రేలు- ఆరోగ్య సేవలు... -సూపరిండెంట్ రాథోడ్ జై సింగ్ రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన పోమాలలో భూసేకరణపై గ్రామసభ బీజేపీ అధికారం కోల్పోతే చచ్చిన పామే.. : సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సిపితోనే గ్రామపంచాయతీలకు పూర్వవైభవం : మదనపల్లె వైకాపా సమన్వయకర్త నిసార్ అహమ్మద్ స్పష్టం : కోళ్లబైలు సర్పంచ్‌ అభ్యర్థిని మేకల ఆశకు మద్ధతుగా ప్రచారం అయ్యప్ప మహా పడిపూజలో.. భీమ్ భరత్ కుప్పిగానిపల్లిలో కూటమి అభ్యర్థి ఆశా సుబ్రహ్మణ్యం విజయభేరి సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం.. ట్రైనీ పైలట్, ఇన్‌స్ట్రక్టర్‌కు గాయాలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వై.వి. శివారెడ్డి

జండర్ వివక్షతకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి ప్రచారం చేయాలి

Select Suryaa Now
జండర్ వివక్షతకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి ప్రచారం చేయాలి

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు వెలుగు కార్యాలయము లో మండల సమాఖ్య ప్రత్యేక సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జండర్ వివక్షతకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి ప్రచారం కోసం కార్యాచరణ ప్రణాళికను కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్,  వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ వారు ఢిల్లీ లో ప్రారంభించిన నయీ చేతన 5.0 కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమము మొదటి వారం 25 .11. 2026 నుండి 1 .12 .2026 వరకు ప్రధాన అంశంగా ఆర్థిక సహకారులుగా మహిళల పాత్ర పట్ల సమాజంలో పెరిగిన అవగాహన మరియు దృక్పదాల్లో మార్పు అనే అంశం మీద ఉంటుందని ఏ.పి.ఎం అనూరాధ తెలిపారు. రెండోవారం 2.12. 26 నుండి 8 .12. 26 వరకు మహిళలకు పురుషులకు సమానంగా వనరులు అందుబాటులోకి తేవడం, సమాన అవకాశాలు కల్పించడం అనేది ప్రధాన అంశంగా ఉంటుందన్నారు. మూడో వారం 9 .12 26 నుండి 15 .12.26 వరకు మహిళలు మరియు బాలికలు మరింత భద్రంగా మరియు స్వేచ్ఛగా ప్రయాణించే పరిస్థితులు కల్పించడం మీద పనిచేస్తారన్నారు. నాలుగో వారం 16. 12 2026 నుండి 23-12. 2026 వరకు మహిళలు చేస్తున్న చెల్లింపు లేని సంరక్షణ గృహపనులపై సామాజిక నిబంధనలను సవాలు చేసి మహిళల పని భారాన్ని తగ్గించటం "పనిని పంచుకుందాం అభివృద్ధిని పంచుకుందాం "అనే నినాదంతో పని చేయవలసి ఉంటుందన్నారు. నెల రోజులు పాటు అన్ని గ్రామాలలో అన్ని చిన్న సంఘాలకు మరియు పెద్ద సంఘాల్లో ఈ కార్యక్రమాలపై చర్చ జరగాలని అనురాధ వివరించారు.  కార్యక్రమంలో మండల సమాఖ్య  ఈసీ మెంబర్, గ్రూప్ సభ్యులు హాజరయ్యారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.