వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వై.వి. శివారెడ్డి
అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని అనంతపురం నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వై.వి. శివారెడ్డి (YTR) తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అనంతపురం అర్బన్‌లో తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల జరిగిన ఎన్నికల పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇరువురు నాయకులు చర్చించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి శ్రీ రమేష్ గౌడ్ విజయానికి కృషి చేసిన *వై.వి. శివారెడ్డి (YTR) ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించి, పార్టీ విజయం కోసం అందించిన సహకారాన్ని ప్రశంసించారు.
అనంతరం అనంతపురం నగరంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, భవిష్యత్తులో పార్టీ చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.
ఈ సమావేశంలో వై.వి. శివారెడ్డి (YTR) తనయుడు వై. మణికంఠ రెడ్డి, సాయి ప్రదీప్ రెడ్డి కూడా పాల్గొని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.