రాటకొండ బాబురెడ్డిని కలిసిన ఎంపీపీ గురునాథ్ యాదవ్ : తన విజయానికి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు : పొన్నీటిపాళ్యం టిడిపి నాయకులతో కలసి ఘనసన్మానం
మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి,ఆయన కుమారుడు పార్టీ యువ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డిలని వారి స్వగృహంలో పొన్నీటిపాళ్యం టిడిపి నాయకులతో కలిసి ఎంపీపీ బీదం గురునాథ్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా తన విజయానికి సహకరించడంతోపాటు,క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతగా శాలువా,పూలమాలలతో ఘనంగా సన్మానించారు.అంతే కాకుండా తాను ఎంపీపీ కావటానికి కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీపీ గురునాథ్ యాదవ్ మాట్లాడుతూ తాను మదనపల్లె మండలంలో ఎంపీపీగా ఎన్నిక కావటానికి,ఎంపీటీసీ సభ్యుడుగా విజయం సాధించడానికి వెనుక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని గుర్తుచేశారు.వారు అందించిన ఈ సహకారం ఎనలేనిదని వారికి ఎప్పుడు రుణపడి ఉంటామన్నారు.అలాగే మండలంలోని ఎంపీటీసీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అందరితో పరస్పరం సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేద్దామని పేర్కొన్నారు.అనంతరం రాటకొండ బాబురెడ్డి స్పందిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో తన అభ్యర్థన మేరకు పొన్నీటిపాళ్యంలో గ్రామ ప్రజలు,పార్టీ శ్రేణులు ఐకమత్యంతో గురునాథ్ యాదవ్ విజయానికి సహకరించినందుకు అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు.ఇదే స్ఫూర్తితో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.యువ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బాబు రెడ్డి ఆదేశాల మేరకు మదనపల్లె మండలంలో ఎంపీపీ,ఎంపీటీసీల విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.అదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు ఐకమత్యంతో సర్పంచ్ ఎన్నికలలోనూ విజయం సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పొన్నీటిపాళ్యం టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు బెల్లం కిట్టన్న,మాజీ సర్పంచ్ శ్రీని వాసులు,చిప్పిలి చెండ్రాయుడు,రాయచోటి చంద్రన్న,జెసిబీ ఈశ్వర్ నాయుడు,శంకర్ రెడ్డి,టి.వి.రమణా రెడ్డి,జి.వినాయుడు,నయాజ్,ఖాదర్,కే.రాజ్ కుమార్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి