BREAKING
నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మీ దంపతులు. ఉచిత కంటి శిబిరంలో 67 మందికి కంటి పరీక్షలు. -జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు గుండ్లసాగరం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి వత్సలమ్మ వరదరాజులు విజయం 25 వేల106 మందికి డిజిటల్ ఎక్స్రేలు- ఆరోగ్య సేవలు... -సూపరిండెంట్ రాథోడ్ జై సింగ్ రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన పోమాలలో భూసేకరణపై గ్రామసభ బీజేపీ అధికారం కోల్పోతే చచ్చిన పామే.. : సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సిపితోనే గ్రామపంచాయతీలకు పూర్వవైభవం : మదనపల్లె వైకాపా సమన్వయకర్త నిసార్ అహమ్మద్ స్పష్టం : కోళ్లబైలు సర్పంచ్‌ అభ్యర్థిని మేకల ఆశకు మద్ధతుగా ప్రచారం అయ్యప్ప మహా పడిపూజలో.. భీమ్ భరత్ కుప్పిగానిపల్లిలో కూటమి అభ్యర్థి ఆశా సుబ్రహ్మణ్యం విజయభేరి సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం.. ట్రైనీ పైలట్, ఇన్‌స్ట్రక్టర్‌కు గాయాలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వై.వి. శివారెడ్డి

వర్గల్ నవోదయ ప్రవేశ పరీక్షకు చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు

Select Suryaa Now
వర్గల్ నవోదయ ప్రవేశ పరీక్షకు చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు

వర్గల్: పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, వర్గల్‌లో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న నవోదయ విద్యాలయ ప్రవేశ ఎంపిక పరీక్ష–2027 ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయని విద్యాలయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరో తరగతిలో మొత్తం 80 సీట్ల భర్తీ కోసం ఈ నెల 28వ తేదీ శనివారం ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రవేశ ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంపిక చేసిన 25 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలు ఇలా.. సిద్ధిపేట జిల్లాలో 11 పరీక్ష కేంద్రాలు.మెదక్ జిల్లాలో 6 పరీక్ష కేంద్రాలు,. సంగారెడ్డి జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలు.మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ వివరించారు. ఈ పరీక్షకు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మొత్తం 5,148 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపారు.

పరీక్ష సిబ్బందికి ప్రత్యేక శిక్షణ..

ప్రవేశ పరీక్ష నిర్వహణలో భాగంగా సెంటర్ సూపరింటెండెంట్లు, సెంటర్ లెవల్ అబ్జర్వర్లుగా నియమితులైన సిబ్బందికి నవంబర్ 26వ తేదీ గురువారం మూడు జిల్లాల ప్రధాన కేంద్రాల్లో జిల్లా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.పరీక్షను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలు, ఇతర కీలక అంశాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు సిబ్బందికి తగిన సూచనలు చేయనున్నట్లు వెల్లడించారు.

అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు..

నవోదయ ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదలైనప్పటి నుంచి వివిధ దశల్లో విద్యాలయానికి సహకరిస్తూ, అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్న మూడు జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, వారి సిబ్బందికి నవోదయ విద్యాలయ సమితి తరఫున ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అన్ని శాఖల సమన్వయంతో ప్రవేశ ఎంపిక పరీక్ష–2027 విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పరీక్ష ప్రశాంతంగా, సజావుగా పూర్తవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.