రామస్వామి పల్లి సర్పంచ్ గా యువనేత విష్ణువర్ధన్ రెడ్డి
ఆత్మకూరు, మేజర్ న్యూస్:
ఆత్మకూరు మండలం రామస్వామి పల్లి గ్రామపంచాయతీ సర్పంచిగా తెలుగుదేశం యువ నేత మెంతెం విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా మెంతెం వేణుగోపాల్ రెడ్డి నామినేషన్ వేయగా గ్రామంలోని అన్ని వర్గాల వారు ఆయనకు మద్దతునిచ్చి పోటీ లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్ పదవికి ఎన్నుకున్నారు. యువకుడైన విష్ణువర్ధన్ రెడ్డి తెలుగుదేశంలో అత్యంత చురుగ్గా వ్యవహరించే నేతగా కొనసాగుతుండగా రామస్వామి పల్లి గ్రామ ప్రజలందరి ఆశీస్సులతో, ఆదరణతో సర్పంచ్ గా ఎన్నికయ్యారు. తనవంతుగా రామస్వామి పల్లి అభివృద్ధి కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సహకారంతో మండల గ్రామ తెలుగుదేశం బిజెపి జనసేన నాయకుల సహకారంతో రామస్వామి పల్లి అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని సమస్యలను పరిష్కరిస్తానని అందరికీ అన్ని విధాల మౌలిక వస్తువులు కల్పిస్తానని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రామస్వామి పల్లి గ్రామంలోని అన్ని వర్గాల నాయకులకు ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మండల స్థాయి కూటమి నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు