సెక్యూరిటీ గార్డు కుటుంబానికి ఎమ్మెల్యే బొజ్జల భరోసా,
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సెక్యూరిటీ గార్డు ధనుంజయ నాయుడు కుటుంబానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అండగా నిలిచారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరుకు ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫార్సు లేఖ పంపించారు.
ధనుంజయ నాయుడు ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక ఇబ్బందులను బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.వి. అమర్‌నాథ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తక్షణ వైద్య సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బాధితుడికి అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా విధి నిర్వహణలో గాయపడిన ఉద్యోగి కుటుంబానికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరఫున కూడా తగిన ఆర్థిక సహాయం అందించాలని ఆలయ అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జి.వి. అమర్‌నాథ్ మాట్లాడుతూ, బాధిత కుటుంబ పరిస్థితిని వివరించిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరుకు సిఫార్సు చేయడంతో పాటు దేవస్థానం తరఫున కూడా ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే చొరవ బాధిత కుటుంబానికి ఎంతో ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు.
ధనుంజయ నాయుడు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరాలని శ్రీకాళహస్తీశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు అమర్‌నాథ్ తెలిపారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి