BREAKING
స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ‘ఆపరేషన్ థండర్’ ఉత్కంఠ.. ఉగ్రదాడి నివారణపై సమగ్ర మాక్ డ్రిల్ రైతుల సమక్షంలోనే భూ రీసర్వే చేపట్టాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మీ దంపతులు. ఉచిత కంటి శిబిరంలో 67 మందికి కంటి పరీక్షలు. -జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు గుండ్లసాగరం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి వత్సలమ్మ వరదరాజులు విజయం 25 వేల106 మందికి డిజిటల్ ఎక్స్రేలు- ఆరోగ్య సేవలు... -సూపరిండెంట్ రాథోడ్ జై సింగ్ రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన పోమాలలో భూసేకరణపై గ్రామసభ బీజేపీ అధికారం కోల్పోతే చచ్చిన పామే.. : సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సిపితోనే గ్రామపంచాయతీలకు పూర్వవైభవం : మదనపల్లె వైకాపా సమన్వయకర్త నిసార్ అహమ్మద్ స్పష్టం : కోళ్లబైలు సర్పంచ్‌ అభ్యర్థిని మేకల ఆశకు మద్ధతుగా ప్రచారం అయ్యప్ప మహా పడిపూజలో.. భీమ్ భరత్ కుప్పిగానిపల్లిలో కూటమి అభ్యర్థి ఆశా సుబ్రహ్మణ్యం విజయభేరి సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా!

Select Suryaa Now
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా!

 

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

ఓర్వకల్లు గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నానని వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి కాశిరెడ్డి తెలిపారు. గ్రామంలో పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తానన్నారు. తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు రహదారులు, డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. తన ప్రణాళికను అమలు చేసేందుకు ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి పనులతో నిరూపించుకుంటానని ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరుతున్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇంటి పట్టాలు, ఇంటి వద్దకే పింఛన్లు అందించామని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రెండున్నరేళ్లయినా అమలు చేయలేదని విమర్శించారు.

ఓటర్లు ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను సర్పంచ్‌గా, తనకు మద్దతుగా పోటీ చేస్తున్న వార్డు సభ్యుల అభ్యర్థులను వారి గుర్తులపై గెలిపించాలని విష్ణువర్ధన్ రెడ్డి కాశిరెడ్డి కోరుతున్నారు. ఈ ప్రచారంలో మాజీ జెడ్పీటీసీ రంగనాథ్ గౌడ్, స్వామిరెడ్డి, శంకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పెద్దయ్య, అనిల్, సునీల్ తదితర వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.