ఠాగూర్ పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు విద్యార్థులకు బహుమతులు అందజేసిన డిప్యూటీ డిఇఓ జానకి రామయ్య
అనుమసముద్రంపేట మేజర్ న్యూస్ బాలల దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రమైన ఏఎస్ పేటలోని ఠాగూర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించారు పాఠశాలలోని ప్లే క్లాస్ నుండి పదవ తరగతి వరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మరియు స్కిల్ కు సంబంధించిన ఎగ్జాంపుల్ స్పెల్ బి ,డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్, క్విజ్ లాంటి అనేక పోటీలను నిర్వహించారు నెహ్రూ జయంతి సందర్భంగా నవంబర్ 14వ తేదీ ఇవ్వవలసిన బహుమతులను సమ్మె టు వన్ ఎగ్జామ్స్ ఉన్నందున బుధవారం ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జానకిరామయ్య చేతుల మీదగా విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది అన్ని తరగతుల విద్యార్థులకు ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులను 400 షీల్డ్ లను అందజేశారు ఈ సందర్భంగా డిప్యూటీ డిఇఓ జానకి రామయ్య మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి అత్యధిక మార్కులు సాధించాలని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని కోరారు విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి జరిగితే విజయం సాధించగలరని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సి హెచ్ వెంకటరమణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు కే దొరస్వామిరెడ్డి, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు