సూర్య కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్-19 యోగా జిల్లా స్థాయి ఎంపికలు, ట్రయల్స్‌లో ఎస్‌వీజేసీ కళాశాలకు చెందిన ఎస్. మహేశ్వరి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. విద్యార్థిని మహేశ్వరి సాధించిన విజయంపై కళాశాల డైరెక్టర్లు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కళాశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కె. రామ్ రెడ్డి, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రాజు, యోగా కోచ్ శ్రావంతి మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలని, మహేశ్వరి రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థిని సాధించిన ఈ విజయంతో ఎస్‌వీజేసీ ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ, కరీంనగర్లో ఆనందం వ్యక్తమైంది. మహేశ్వరికి కళాశాల సిబ్బంది, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.