BREAKING
నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మీ దంపతులు. ఉచిత కంటి శిబిరంలో 67 మందికి కంటి పరీక్షలు. -జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు గుండ్లసాగరం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి వత్సలమ్మ వరదరాజులు విజయం 25 వేల106 మందికి డిజిటల్ ఎక్స్రేలు- ఆరోగ్య సేవలు... -సూపరిండెంట్ రాథోడ్ జై సింగ్ రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన పోమాలలో భూసేకరణపై గ్రామసభ బీజేపీ అధికారం కోల్పోతే చచ్చిన పామే.. : సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సిపితోనే గ్రామపంచాయతీలకు పూర్వవైభవం : మదనపల్లె వైకాపా సమన్వయకర్త నిసార్ అహమ్మద్ స్పష్టం : కోళ్లబైలు సర్పంచ్‌ అభ్యర్థిని మేకల ఆశకు మద్ధతుగా ప్రచారం అయ్యప్ప మహా పడిపూజలో.. భీమ్ భరత్ కుప్పిగానిపల్లిలో కూటమి అభ్యర్థి ఆశా సుబ్రహ్మణ్యం విజయభేరి సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం.. ట్రైనీ పైలట్, ఇన్‌స్ట్రక్టర్‌కు గాయాలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వై.వి. శివారెడ్డి

నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళ్తున్న సర్పంచ్ అభ్యర్థి షాహినాబేగం

Select Suryaa Now
నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళ్తున్న సర్పంచ్ అభ్యర్థి షాహినాబేగం


ఆత్మకూరు, మేజర్ న్యూస్:
ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా కూటమి ఆధ్వర్యంలో బలపరిచిన షేక్ షాహినా బేగం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఆమె పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. నామినేషన్ వేసిన నాటి నుండే అధిక సంఖ్యలో మహిళలు ఆమెకు బాసటగా నిలుస్తూ బ్రహ్మరధం పడుతున్నారు. కూటమి పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా షాహినా బేగం ఎన్నికల ప్రచారాన్ని పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో కాలనీల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. అన్ని వర్గాలు ఆమెను ఆదరిస్తూ ఆశీస్సులు అందజేస్తూ విజయం చేకూరుస్తామని హామీ ఇస్తున్నారు.తనను సర్పంచిగా గెలిపిస్తే పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని,అభివృద్ధి సంక్షేమం సాధిస్తామని, పంచాయతీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సాధిస్తానని, రోడ్లు డ్రైన్ లు తదితర సౌకర్యాలు కల్పిస్తానని,అన్ని వర్గాల సంక్షేమ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సహకారంతో నువ్వురుపాడు పంచాయతీని మరింతగా అభివృద్ధి పరిచి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని షాహినా బేగం పేర్కొన్నారు.ఆమెకు మద్దతు ఇస్తున్న కూటమి నాయకులతో ప్రజలకు హామీలు ఇస్తూ ఉండటంతో షాహినా బేగం కు విశేషాదరణ మద్దతు లభిస్తుంది. అందరూ ఆదరించి ఆశీస్సులు అందజేసిన తనకు కత్తెర గుర్తుపై ఓట్లు వేసి విజయం చేకూర్చాలని షాహినా బేగం కోరుతున్నారు.