నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు
కనిగిరి, మేజర్‌న్యూస్ :
కనిగిరి పట్టణానికి చెందిన కదిరి వెంకట నరసయ్య కుమార్తె లిఖిత, కోవిలంపాడు గ్రామానికి చెందిన తవ్వా శేషయ్య కుమారుడు సాయి కృష్ణ ల నిశ్చితార్థ వేడుక బుధవారం కనిగిరి లోని నందూస్ ఫంక్షన్ హల్ లో జరిగింది. ఈ కార్యక్రమం లో కనిగిరి మాజీ ఎమ్మెల్యే ,విశాఖపట్నం పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు కదిరి బాబురావు పాల్గొని లిఖిత ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కదిరి రమణయ్య, కదిరి పిచ్చయ్య, కదిరి కృష్ణ, మాజీ కౌన్సిలర్స్ షేక్ ఫయాజ్,పీ రహీమ్ బాషా,కోవిలంపాడు ఎంపీటీసీ సభ్యులు గూడం శెట్టి రవి కుమార్,షేక్ రషీద్, తవ్వా తిరుపతయ్య,మన్నేపల్లి రవి ,పట్నం తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.