అంతర్జాతీయ వేదికపై ఒంగోలు నగర మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
ముంబైలోని హోటల్ ఫెయిర్‌మాంట్‌లో నవంబర్ 25, 26 తేదీల్లో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ మేయర్ల సదస్సు (3rd World Mayors’ Forum) మరియు 7వ ఆసియా నగరాల సదస్సు (7th Asian Cities Summit 2026) కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప గారు పాల్గొన్నారు.
ఈ అంతర్జాతీయ సదస్సులో గుంటూరు నగర మేయర్ శ్రీమతి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గారు, ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర చైర్మన్ శ్రీ కొమిరెడ్డి పట్టాభి గారితో కలిసి శ్రీ శిల్ప గారు పాల్గొని వివిధ నగరాల మేయర్లు, ప్రజాప్రతినిధులు, పట్టణాభివృద్ధి రంగ నిపుణులతో మమేకమయ్యారు.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో పట్టణ పాలన, ఆధునిక మౌలిక సదుపాయాలు, సుస్థిర నగరాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజలకు మెరుగైన పౌరసేవలు వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.
ఒంగోలు నగరాన్ని ఆధునిక అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రపంచస్థాయి పట్టణాభివృద్ధి ఆలోచనలు, నూతన పాలనా విధానాలను తెలుసుకునే ఈ అంతర్జాతీయ వేదిక ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంతర్జాతీయ స్థాయిలో ఒంగోలు నగర ప్రాతినిధ్యం.. అభివృద్ధి దిశగా మరో ముందడుగు!