BREAKING
నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మీ దంపతులు. ఉచిత కంటి శిబిరంలో 67 మందికి కంటి పరీక్షలు. -జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు గుండ్లసాగరం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి వత్సలమ్మ వరదరాజులు విజయం 25 వేల106 మందికి డిజిటల్ ఎక్స్రేలు- ఆరోగ్య సేవలు... -సూపరిండెంట్ రాథోడ్ జై సింగ్ రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన పోమాలలో భూసేకరణపై గ్రామసభ బీజేపీ అధికారం కోల్పోతే చచ్చిన పామే.. : సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సిపితోనే గ్రామపంచాయతీలకు పూర్వవైభవం : మదనపల్లె వైకాపా సమన్వయకర్త నిసార్ అహమ్మద్ స్పష్టం : కోళ్లబైలు సర్పంచ్‌ అభ్యర్థిని మేకల ఆశకు మద్ధతుగా ప్రచారం అయ్యప్ప మహా పడిపూజలో.. భీమ్ భరత్ కుప్పిగానిపల్లిలో కూటమి అభ్యర్థి ఆశా సుబ్రహ్మణ్యం విజయభేరి సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం.. ట్రైనీ పైలట్, ఇన్‌స్ట్రక్టర్‌కు గాయాలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వై.వి. శివారెడ్డి

సిరిసిల్లలో నూతనంగా సినీ ఫెస్ట్ మినీ ప్రైవేట్ థియేటర్ ప్రారంభం

Select Suryaa Now
సిరిసిల్లలో నూతనంగా సినీ ఫెస్ట్ మినీ ప్రైవేట్ థియేటర్ ప్రారంభం

సిరిసిల్లలో నూతనంగా సినీ ఫెస్ట్ మినీ ప్రైవేట్ థియేటర్ ప్రారంభం

​సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి: సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన 'సినీ ఫెస్ట్ మినీ ప్రైవేట్ థియేటర్' బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై థియేటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇలాంటి మినీ థియేటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో సినిమాలు, డాక్యుమెంటరీలను వీక్షించే అవకాశం దీని ద్వారా కలుగుతుందన్నారు. ఇటువంటి నూతన వ్యాపారాల వల్ల స్థానిక యువతకు ఉపాధి లభించడంతో పాటు పట్టణ ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పట్టణాల్లోకి ఈ సంస్థను విస్తరించాలని థియేటర్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, ఉపాధ్యక్షులు ఎండీ సత్తార్, మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణ చందర్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఆడిచర్ల సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.