BREAKING
8వ డివిజన్‌లో ఇందిరమ్మ బీమా నమోదు కార్యక్రమం నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఐపీఎల్ 2027కు ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం.. బౌలింగ్ కోచ్‌గా పారాస్ మాంబ్రే నియామకం యోగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎస్‌వీజేసీ విద్యార్థిని మహేశ్వరి ఎంపిక అంతర్జాతీయ వేదికపై ఒంగోలు నగర మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ ప్రక్షాళన.. మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ సహా నలుగురు సీనియర్ల కెరీర్ ముగిసినట్లేనా? సిరిసిల్లలో నూతనంగా సినీ ఫెస్ట్ మినీ ప్రైవేట్ థియేటర్ ప్రారంభం నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళ్తున్న సర్పంచ్ అభ్యర్థి షాహినాబేగం సెక్యూరిటీ గార్డ్ కుటుంబానికి ఎమ్మెల్యే బొజ్జల భరోసా రాజకీయాలంటే పదవులే ప్రామాణికం కాదు:కిమిడి నాగార్జున కడప జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, పైప్ లైన్ ధ్వంసంపై వివరణ కోరిన ముఖ్యమంత్రి ఠాగూర్ పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు విద్యార్థులకు బహుమతులు అందజేసిన డిప్యూటీ డిఇఓ జానకి రామయ్య స్వచ్ఛమైనా త్రాగునీరు అందించడమే లక్ష్యం ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే విధులకు హాజరుకావాలి - జీఎం మునిగంటి శ్రీనివాస్

15 మంది రౌడీ షీటర్లకు బైండోవర్ - సీపీ గౌస్ ఆలం

Select Suryaa Now
15 మంది రౌడీ షీటర్లకు బైండోవర్ - సీపీ గౌస్ ఆలం
సూర్య కరీంనగర్ : శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన 15 మంది రౌడీ షీటర్లను బుధవారం సీపీ గౌస్ ఆలం బైండోవర్ చేశారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్లు 126 నుంచి 136 ప్రకారం విచారణ జరిపి, ఏడాది పాటు సత్ప్రవర్తనతో ఉంటామని ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష పూచీకత్తుతో బాండ్లు రాయించుకున్నారు. జమ్మికుంట, కరీంనగర్ టౌన్-1, టౌన్-2, రూరల్, కొత్తపల్లి, మానకొండూర్, హుజూరాబాద్, చొప్పదండి, ఎల్లందకుంట, చిగురుమామిడి, వీణవంక, సైదాపూర్, కేశవపట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలోని వారు ఈ జాబితాలో ఉన్నారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ నేరాలకు పాల్పడితే పూచీకత్తు సొమ్ము జప్తు చేయడంతో పాటు జైలు శిక్ష సహా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.