BREAKING
చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యే లక్ష్యం కేసీఆర్‌పై అభిమానంతో పాదయాత్ర తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి 30న లోక్‌సభ, 2న రాజ్యసభ ప్రత్యేక సమావేశాలు.. రాజ్యాంగ స్ఫూర్తితో ఉత్తమ పౌరులుగా ఎదగాలి స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ‘ఆపరేషన్ థండర్’ ఉత్కంఠ.. ఉగ్రదాడి నివారణపై సమగ్ర మాక్ డ్రిల్ రైతుల సమక్షంలోనే భూ రీసర్వే చేపట్టాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మీ దంపతులు. ఉచిత కంటి శిబిరంలో 67 మందికి కంటి పరీక్షలు. -జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు గుండ్లసాగరం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి వత్సలమ్మ వరదరాజులు విజయం 25 వేల106 మందికి డిజిటల్ ఎక్స్రేలు- ఆరోగ్య సేవలు... -సూపరిండెంట్ రాథోడ్ జై సింగ్ రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన పోమాలలో భూసేకరణపై గ్రామసభ

వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ

Select Suryaa Now
వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ
సూర్య, పెంచికల్‌పేట్: మండలంలోని ఆగర్‌గూడ గ్రామంలో విలేజ్ ఆర్గనైజేషన్ (వీఓ) గ్రామ సంఘం భవన నిర్మాణానికి బుధవారం సర్పంచ్ అల్లూరి రాజేశ్వరి రాజు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సొంత భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక అభివృద్ధికి గ్రామ సంఘం భవనం దోహదపడుతుందని పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం మోహన్‌లాల్, సీసీ జ్యోతిరావు, వీఓఏ అంకిత, వీఓ అధ్యక్షురాలు విమల, కార్యదర్శి కిష్టయ్య, ఉపాధ్యాయుడు రామాకాంత్, గ్రామ సంఘం సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు , గ్రామస్తులు పాల్గొన్నారు.