telangana
పూలే వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి
సూర్య వాంకిడి : మహాత్మా జ్యోతిబా పూలే 131వ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మాలి సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం వాంకిడి తహసీల్దార్ కవితకు వినతిపత్రం అందజేశారు.గత 20 ఏళ్లుగా మాలి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నామని నాయకులు తెలిపారు. మాలి సామాజిక వర్గానికి సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సెండ్ వాసు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురునులే నారాయణ, నాయకులు సెండే శ్యామ్, రాజ్ కుమార్, శ్యాం రావు తదితరులు పాల్గొన్నారు.