andhrapradesh
దుబాయ్ లో అవనిగడ్డ అధ్యాపకురాలికి అంతర్జాతీయ అవార్డు
అవనిగడ్డ,మేజర్ న్యూస్: విద్యారంగంలో విశేష సేవలందించిన అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ అధ్యాపకురాలు డాక్టర్ టి. దేనా ఎలిజిబెత్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ అవార్డు ఫోరం (అమెరికా–ఇండియా) సౌజన్యంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో నవంబర్ 21న నిర్వహించిన దుబాయ్ ఇంటర్నేషనల్ సమ్మిట్–2026లో ఆమెకు ప్రతిష్టాత్మకమైన టిఐఏఎఫ్ ఎడ్యుకేషనల్ అవార్డు ప్రదానం చేశారు.
వాణిజ్య శాస్త్ర విద్యా రంగంలో 28 సంవత్సరాలుగా ఆమె అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఇందులో మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో 23 సంవత్సరాలు, అవనిగడ్డ డిగ్రీ కళాశాలలో ఐదు సంవత్సరాల పాటు ఆమె అందించిన విద్యా సేవలు ఉన్నాయి.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సుజాత కామర్స్ అధ్యాపకురాలు డాక్టర్ దేనా ఎలిజిబెత్‌ను అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆమె సాధించిన విజయంపై కళాశాల విద్యా కుటుంబం హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసించింది.
✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.