telangana
మోతే గ్రామంలో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం
సూర్య వేల్పూరు : వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అనుబంధంగా నూతనంగా మంజూరైన ప్రీ ప్రైమరీ పాఠశాలను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దొల్ల రమేష్ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ దొల్ల రమేష్ మాట్లాడుతూ మోతే గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు కావడం ఎంతో సంతోషకరమని తెలిపారు. పాఠశాల మంజూరుకు కృషి చేసిన ఎంఈఓ రేణుక మేడం, జిల్లా విద్యాశాఖ అధికారి, సంబంధిత అధికారులందరికీ గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం ఎంఈఓ రేణుక మేడం మాట్లాడుతూ మోతే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రీ ప్రైమరీ పాఠశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. చిన్నారులకు ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్య అందించేందుకు ఈ పాఠశాల ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ రేణుక, హెచ్ఎం రాజన్న, జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, ఉప సర్పంచ్ పరంజ్యోతి, వీడీసీ సభ్యులు దమ్మాయి గంగారెడ్డి, ఆదర్శ కమిటీ సభ్యురాలు భూదేవి, పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.