అల్లంపాడులో ముమ్మర ప్రచారం * అభ్యర్థిస్తున్న సర్పంచ్ అభ్యర్థి ఖాజాహుస్సేన్
మర్రిపాడు మేజర్ న్యూస్: మర్రిపాడు మండలంలోని అల్లంపాడు పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి ఖాజాహుస్సేన్ ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. ఈ తరుణంలో కరపత్రాలను పంపిణీ చేసి తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో సర్పంచ్ గా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేసి గెలిపిస్తే మంత్రి ఆనం సహకారంతో పంచాయితీని అభివృద్ధి పథలో నడిపిస్తానని తెలియజేస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఆ సర్పంచ్ అభ్యర్థి వెంట స్వచ్ఛందంగా యువత ముందుకు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ఓటర్లకు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాతిరెడ్డి వీరారెడ్డి, గూడాల శ్రీనివాసులు, పంచాయితీలోని యువత, తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటున్నారు.