telangana
ఇందిరమ్మ బీమా పథకంపై అవగాహన కార్యక్రమం
సూర్య వేల్పూరు : వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ బీమా పథకంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఇందిరమ్మ బీమా పథకం ముఖ్య ఉద్దేశాలు, ప్రయోజనాలు, అర్హతలు, పథకం ద్వారా కలిగే ఆర్థిక భద్రత తదితర అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పథకానికి సంబంధించిన సందేహాలు ఉంటే గ్రామపంచాయతీ సిబ్బందిని సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని తెలిపారు.ప్రజలకు సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వ పథకాలపై అవగాహన ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిన్నా జనార్ధన్, ఉపసర్పంచ్ సురేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.