పేటేరు అభివృద్ధే లక్ష్యంగా కూటమి సర్పంచ్ అభ్యర్థి డొక్కు శివ పార్వతి ప్రచార ముమ్మరం మంత్రి అనగాని సత్యప్రసాద్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం
రేపల్లె మేజర్ న్యూస్; పేటేరు గ్రామ పంచాయతీలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి డొక్కు శివ పార్వతి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తనకు, వార్డు సభ్యుల అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహకారంతో పేటేరు గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.గ్రామ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ సహకారంతో పేటేరు పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తనను, వార్డు సభ్యుల అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని డొక్కు శివ పార్వతి ఓటర్లను కోరారు. ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు