BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

పెనుగొండ కామాక్షి ఆలయంలో నవరాత్రోత్సవాలు ప్రారంభం

Select Suryaa Now
పెనుగొండ కామాక్షి ఆలయంలో నవరాత్రోత్సవాలు ప్రారంభం

వాసవి పెనుగొండ, సూర్య న్యూస్: పెనుగొండ గ్రామంలోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో వైభవంగా ప్రారంభమయ్యాయి. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించగా, అమ్మవారి సన్నిధి భక్తి భావంతో, మంగళకరమైన వాతావరణంతో విరాజిల్లింది.నవరాత్రి ఉత్సవాల తొలిరోజున శ్రీ కామాక్షి అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.బాలారూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, సకల శుభాలు కలగాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా రామోజు కృష్ణ కిషోర్, శ్రీమతి దేవి దంపతులు తొలిరోజు పూజా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కలశ స్థాపన నిర్వహించి, జగన్మాతకు ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన విశేష కుంకుమ పూజలో పాల్గొని, భక్తితో అమ్మవారిని అర్చించి ఆశీస్సులు అందుకున్నారు.పసుపు, కుంకుమలు, సుగంధ పుష్పాలతో అలంకరించిన బాలా త్రిపురసుందరి అమ్మవారి దివ్యరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణమంతా దేవీ నామస్మరణతో మార్మోగగా, భక్తుల ప్రార్థనలు, పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.జగజ్జనని కరుణాకటాక్షాలు అందరిపై ప్రసరించాలని, లోకమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు. భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు తొలి రోజే భక్తులకు దైవానుభూతిని పంచాయి.ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు మండ ప్రసాద్ దంపతులుపాల్గొనగాభక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్: పి.వెంకట్రామయ్య ,పెనుగొండ ,పశ్చిమ గోదావరి జిల్లా