పెద్దల ఆశీస్సులతో 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాం
నెల్లూరు, మేజర్ న్యూస్ : 21వ డివిజన్‌లో కార్పొరేటర్‌గా ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు, తనకు అండగా నిలిచిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పొంగూరు నారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తన విజయానికి విశేషంగా సహకరించి, డివిజన్‌లో ప్రజాదరణ పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్‌లను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పెద్దల ఆశీస్సులతో 21వ డివిజన్ సమగ్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. డివిజన్‌లోని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యం – అభివృద్ధే మా సంకల్పం అనే నినాదంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.