BREAKING
ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలసి సన్మానించిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య ఎస్‌ఎస్‌ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ అప్‌‌డేట్, రికార్డు వేగంతో జక్కన్న ప్రాజెక్ట్ ఓటీటీకి వచ్చేసిన మలయాళ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు వసూలు చేసిన సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే కూటమి హామీలన్నీ నీటి మూటలే.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ దేవర చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం.. మహిళల గౌరవం ఆటవస్తువు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం

పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి*  *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

కర్నూలు, అక్టోబర్ 3:- పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి యంగ్ ప్రొఫెషనల్స్ సిబ్బందిని ఆదేశించారు..

శనివారం "స్వర్ణాంధ్ర @2047 విజన్"  అంశం పై అన్ని నియోజకవర్గాల 'యంగ్ ప్రొఫెషనల్స్'  తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు చేరేలా విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు, పేద కుటుంబాలను గుర్తించి వారికి అవసరమైన ప్రభుత్వ సహాయాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ యంగ్ ప్రొఫెషనల్స్ సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అందని, జీవనోపాధి కోసం ప్రత్యేక సహాయం అవసరమైన అత్యంత పేద, నిరుపేద కుటుంబాలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. సర్వే అనంతరం గుర్తించిన కుటుంబాల వివరాలను నియోజకవర్గాల వారీగా రూపొందించి, వారికి అవసరమైన సహాయాన్ని అందించేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబాల అవసరాలను బట్టి బ్యాంకు రుణాలు, పింఛన్లు, ఉపాధి అవకాశాలు, జాబ్ మేళాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వైద్య చికిత్సకు సహాయం, ఉన్నత విద్యకు అవసరమైన సహకారం, స్వయం ఉపాధి అవకాశాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు తదితర మార్గాల ద్వారా తోడ్పాటు అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా వ్యక్తిగత, సామాజిక అవసరాలను గుర్తించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఎన్ని కుటుంబాలకు ఉద్యోగాలు అవసరం, ఎంతమందికి నైపుణ్య శిక్షణ అవసరం, వారి విద్యార్హతలు ఏమిటి, ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనే వివరాలను అందించాలన్నారు..ఇళ్ల స్థలాలు, గృహాలు అవసరమైన వారి వివరాలను కూడా నియోజకవర్గాల వారీగా సర్వే చేసి సమగ్రంగా రూపొందించాలన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులతో  సమన్వయం చేసుకోవడంతో పాటు, దాతలు, పూర్వ విద్యార్థుల సంఘాలు (Alumni), ఇతర సంస్థల సహకారాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల ఆదాయం పెంచేందుకు అవసరమైన సహాయాన్ని గుర్తించాలని, సహజ వ్యవసాయం, ఉద్యాన పంటలు, పిఎండిఎస్ వంటి కార్యక్రమాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. ఆయా ప్రాంతాల పరిస్థితులు, మార్కెట్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని రైతులకు తగిన మార్గదర్శకత్వం అందించాలని  కలెక్టర్ పేర్కొన్నారు. సామాజిక అవసరాల కింద రోడ్లు, తాగునీరు, చిన్నతరహా RO ప్లాంట్లు తదితర మౌలిక వసతుల అవసరాలను గుర్తించాలన్నారు. CSR నిధుల ద్వారా చేపట్టగల పనులను గుర్తించి, సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుని వాటిని త్వరితగతిన అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. వారం రోజుల్లోగా అవసరాల వివరాలు, ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు..

10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువు మధ్యలో నిలిపివేసిన యువత వివరాలను ప్రత్యేకంగా సేకరించి, వారిని జాబ్ మేళాలకు ఆహ్వానించి ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ యంగ్ ప్రొఫెషనల్స్ సిబ్బందిని ఆదేశించారు.. ఇప్పటికే అమరరాజా బ్యాటరీస్ సంస్థ ద్వారా 250 మంది అభ్యర్థులకు ఒకే రోజున నియామక ఉత్తర్వులు అందించిన విషయాన్ని కలెక్టర్ ప్రస్తావించారు. పేదరికంపై విజయం సాధించాలంటే గుర్తించిన కుటుంబాలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా స్థిరమైన ఆదాయ వనరులు కలిగిన కుటుంబాలుగా తీర్చిదిద్దే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ యంగ్ ప్రొఫెషనల్స్ సిబ్బందిని ఆదేశించారు..

సమావేశంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, సిపిఓ భారతి, యంగ్ ప్రొఫెషనల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.